AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముంచుకొస్తున్న ఇంధన సంక్షోభం! ‘రెట్టింపు ముప్పు’ చూడబోతున్న ప్రపంచం!

వారం రోజులుగా ఒకటే పుకార్లు. పాకిస్తాన్ మీద. పాక్ పనైపోయింది.. ఈ వారాంతంలో లాక్‌డౌన్.. మళ్లీ కరోనా నాటి సిట్యుయేషన్.. అంటూ సోషల్ మీడియాలో వార్తలు. ఛ..అలాంటిదేం లేదు, ఆ పుకార్లు నమ్మొద్దని పాక్ ప్రభుత్వం ఓ అఫీషియల్ స్టేట్‌మెంట్ ఇచ్చింది. అలా ఇస్తూ ఏమందో తెలుసా.. 'కాకపోతే వారానికో నాలుగు రోజులు మాత్రమే వర్కింగ్ డేస్.. సోమవారం నుంచి గురువారం వరకు.. అంతేగానీ శనివారం, ఆదివారం లాక్‌డౌన్ కాదు' అని చెప్పింది. పెద్ద తేడా ఏముంది అందులో. దాదాపుగా ఒకటే కదా. ఇదంతా ఎందుకంటే.. పెట్రోల్, డీజిల్ లేక అల్లాడిపోతోంది పాకిస్తాన్. బాబ్బాబు.. రోడ్ల మీదకు రాకండి అని బతిమాలుకుంటోంది. మరోవైపు పెట్రోల్ కోసం తన్నుకుంటున్నారు పాకిస్తానీయులు. దొంగతనాలు చేస్తున్నారు. దీంతో పెట్రోల్ దొంగలపై టెర్రరిస్ట్ ముద్ర వేసేలా ఆర్డినెన్స్ తెచ్చింది పాకిస్తాన్. అయినా.. ఒక్క పాక్‌నే ఎందుకు బ్లేమ్ చేయడం. యూరప్‌లోనూ ఇదే పరిస్థితి కదా. క్యానుల నిండా పెట్రోల్ నింపుకుని ఉడాయిస్తున్నారు. అమెరికాలో కార్ పెట్రోల్ ట్యాంకులకు కన్నాలు పెట్టి మొత్తం లాగేసుకుంటున్నారు. యూకే, ఫ్రాన్స్, జర్మనీలోనూ అంతే. ఆయిల్ అండ్ గ్యాస్ సంక్షోభం ముంచుకొస్తోంది. మరి.. భారత్‌లో? రెండు నెలల వరకు ఆయిల్ కొరత లేదు. మరి గ్యాస్ సంగతేంటి? గ్యాస్ కొరత కూడా లేదు. బట్.. కొరత సృష్టిస్తున్నారు. ఓ డేటా ఉంది. పట్టుబడుతున్న గ్యాస్ సిలిండర్ల డేటా అది. ఇన్ని వేల సిలిండర్లు అక్రమంగా నిల్వచేశారా అనిపిస్తుంది ఆ నెంబర్ విన్నాక. ఏదేమైనా.. ప్రపంచం ముందు 'నెల' గండం ఉంది. ఈ నెలాఖరుకో, అంతకంటే ముందో.. చమురు సంక్షోభం ముంచుకు రాబోతోంది. బట్.. ఈ నెలలోనే ఎందుకని? ఎనీ పర్టిక్యులర్ రీజన్?

ముంచుకొస్తున్న ఇంధన సంక్షోభం! 'రెట్టింపు ముప్పు' చూడబోతున్న ప్రపంచం!
Global Fuel Crisis
Ram Naramaneni
|

Updated on: Apr 02, 2026 | 9:08 PM

Share

‘రెట్టింపు ముప్పు’.. కోట్ చేసి మాట్లాడుకోవాల్సిన వార్నింగ్ ఇది. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఈ విషయమై పెద్ద హెచ్చరికే చేసింది. 1970ల నాటి చమురు సంక్షోభం కంటే ఈ ఏప్రిల్, మేలో రాబోయే క్రైసిస్ అత్యంత భయంకరంగా ఉండబోతోందని చెప్పింది. ఇప్పటివాళ్లకి 1970 నాటి ఆయిల్ క్రైసిస్ ఎలా ఉంటుందో తెలియకపోవచ్చు. ఆనాడు బ్యారెల్ క్రూడాయిల్ ఏకంగా 400 పర్సెంట్ పెరిగింది. అమెరికా, యూరప్‌లలో పెట్రోల్ బంకుల ముందు కిలోమీటర్ల కొద్దీ కార్లు క్యూ కట్టి ఉండేవి. కార్ నెంబర్ ప్లేట్‌ చివరి అంకెను బట్టి ఏ రోజు పెట్రోల్ పోయించుకోవాలో ప్రభుత్వాలు నిర్ణయించేవి. గన్ ఫైరింగ్, హింసాత్మక ఘటనలు జరగని రోజు లేదు ఆరోజుల్లో. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. సో, ‘రెట్టింపు ముప్పు’ అనే వార్నింగ్‌కు అర్థం.. 1970 నాటి సంక్షోభాన్ని మించి ఉండబోతోందని. IEA ఓ అనాలసిస్ చేసింది. ఆ విశ్లేషణ ప్రకారం ఈ ఏప్రిల్‌లో రెండు ప్రధాన సమస్యలు ఏకకాలంలో దాడి చేయబోతున్నాయి. ఒకటి.. సప్లై షాక్. సరఫరా గొలుసు తెగిపోవడం. పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధం కారణంగా హోర్ముజ్ జలసంధి, అటు ఎర్ర సముద్రం మార్గాలు దాదాపు మూతపడ్డాయి. దీనివల్ల ప్రతిరోజూ సుమారు రెండున్న కోట్ల బ్యారెళ్ల చమురు రవాణా నిలిచిపోయింది. అంటే.. ప్రపంచ ఆయిల్ వినియోగంలో దాదాపు 20 నుంచి 25 శాతం చమురు రవాణా స్తంభించింది. రెండోది.. డిమాండ్ స్పైక్. డిమాండ్ పెరగడం. ఈ ఏప్రిల్‌లోనే...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి