నీతులకు కమర్షియల్ కోటింగ్ వేసే డైరెక్టర్.. అన్నీ జీవిత సత్యాలే..

Rajitha Chanti

Pic credit - Instagram

09 February 2026

తెలుగు సినిమా మాటకు ఆయన సరికొత్త నడకలు నేర్పించారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో తన సినిమాలతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు ఈ డైరెక్టర్.

ఆయన మరెవరో కాదు డైరెక్టర్ త్రివిక్రమ్. నవ్విస్తాడు, కవ్విస్తాడు, వెక్కిరిస్తాడు, ఏడిపిస్తాడు. తన సినిమాలతో తెలుగు సినీప్రియులను మెప్పిస్తుంటాడు.

త్రివిక్రమ్ డైలాగ్స్. వయసు అయిపోయిన హీరోలందరూ రాజకీయ నాయకులు అయిపోయినట్లు...ఫెయిల్ అయిపోయిన ప్రేమికులందరూ ప్రెండ్స్ కాలేరు.

బాధలో ఉన్న వాడిని బాగున్నావా అని అడగటం అమాయకత్వం...బాగున్న వాడిని ఎలా ఉన్నావని అడగటం అనవసరం అంటాడు డైరెక్టర్ త్రివిక్రమ్. 

కూతురిని కంటే పెళ్లి చేసి అత్తారింటికి పంపి కన్నీళ్లు పెట్టుకోవటం కాదు.. మోసపోయి కన్నవాళ్ల దగ్గరకి వస్తే కన్నీళ్లు తుడవడానికి కూడా సిద్ధంగా ఉండాలి.

సంపాదించడం చేతకాని వాడికి ఖర్చుపెట్టే అర్హత లేదు...చెప్పే ధైర్యం లేని వాడికి ప్రేమించే హక్కు లేదు. తండ్రికి, భవిష్యత్తుకి భయపడని వాడు జీవితంలో పైకి రాలేడు.

మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టే వారు, మనం ఓడిపోయినప్పుడు భుజం తట్టేవారు నలుగురు లేనప్పుడు ఎంత సంపాదించినా...ఎంత పొగొట్టుకున్నా తేడా ఉండదు.

 వాడిదైన రోజున ఎవ‌డైనా కొట్టగ‌ల‌డు. అస‌లు గొడ‌వ రాకుండా ఆపుతాడు చూడు.. వాడు గొప్పోడు. తండ్రికి, భవిష్యత్తుకి భయపడని వాడు జీవితంలో పైకి రాలేడు.