AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Khammam: ‘మాకు ఆ బ్రాండ్ మందే కావాలి..’ లేదన్నందుకు మందుబాబులు ఏం చేశారో చూడండి..

ఖమ్మంలో మందుబాబుల వీరంగం సృష్టించారు. కోరిన మద్యం బ్రాండ్‌ ఇవ్వలేదని వైన్‌షాప్‌ క్యాషియర్‌పై దాడికి దిగారు ఐదుగురు యువకులు. తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామంలోని తిరుమల వైన్‌షాప్‌లో జరిగిన ఈ ఘటన సీసీ కెమెరాలో రికార్డయింది. బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు ..

Khammam: 'మాకు ఆ బ్రాండ్ మందే కావాలి..' లేదన్నందుకు మందుబాబులు ఏం చేశారో చూడండి..
Wine Shop Violence
N Narayana Rao
| Edited By: Ram Naramaneni|

Updated on: Oct 31, 2025 | 4:28 PM

Share

మేము అడిగిన మద్యం బ్రాండ్ కావాల్సిందే అని పట్టు పట్టారు మందుబాబులు. ఆ బ్రాండ్ లేదని చెప్పడంతో మత్తులో రెచ్చిపోయి వీరంగం సృష్టించారు. అడిగిన బ్రాండ్ లేదన్నందుకు వైన్ షాపు కౌంటర్ క్యాషియర్‌పై దాడికి దిగారు. ఖమ్మం జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామంలో ఉన్న “తిరుమల వైన్ షాప్” లో పోలెపొంగు కృష్ణ అనే వ్యక్తి గత 6ఏళ్ల నుంచి క్యాషియర్‌గా పని చేస్తున్నాడు. ఇటీవల వైన్ షాప్ దగ్గరికి వచ్చిన ఐదుగురు వ్యక్తులు మాకు రాయల్ స్ట్రాంగ్ మందు బాటిల్ కావాలని అడిగారు. ఆ బ్రాండ్ తమ వద్ద లేదని కృష్ణ చెప్పగా ఒక్కసారిగా వారు రెచ్చిపోయారు.. కౌంటర్లోకి చొరబడి కృష్ణపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. ఎంత వారించినా వినలేదు. ఈ దాడి ఘటన మొత్తం ఆ షాప్‌లో ఉన్న CC కెమెరాలో రికార్డు అయింది. వారి దాడిలో బాధితుడుకు గాయాలయ్యాయి.. కృష్ణ  స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి