Hyderabad: హైదరాబాద్ వాసులకు అలెర్ట్.. ఈ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా బంద్.. ఇదిగో లిస్ట్
హైదరాబాద్ నగర వాసులకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ కీలక ప్రకటన జారీ చేసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో తాగు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని.. ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని కోరింది. ఈ మేరకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ మంగళవారం ప్రకటన విడుదల చేసింది.

హైదరాబాద్ నగర వాసులకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ కీలక ప్రకటన జారీ చేసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో తాగు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని.. ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని కోరింది. ఈ మేరకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ మంగళవారం ప్రకటన విడుదల చేసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో రాబోయే రోజుల్లో 18 గంటల పాటు తాగు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని పేర్కొంది. ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని కోరింది. కాబట్టి ఏ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం కలగనుందో తెలుసుకుందాం..
హైదరాబాద్ మహానగరానికి తాగునీరు సరఫరా చేసే సింగూరు ప్రాజెక్టులో పెద్దపూర్ నుంచి సింగపూర్ వరకు ఉన్న 1600 ఎంఎం డయా ఫేజ్ – 3 మెయిన్ పైప్‌లైన్‌లో భారీ లీకేజీలను అరికట్టడానికి అత్యవసర మరమ్మత్తు పనులు చేపట్టనున్నారు. దీనితో పాటు, టిఎస్ ట్రాన్స్‌కో ఆధ్వర్యంలో 132కేవీ కంది సబ్‌స్టేషన్ వద్ద పెద్దపూర్ ఫీడర్‌కు సంబంధించి ఏంఆర్ టి టెస్టింగ్, హాట్ లైన్ రిమార్క్స్ లతో పాటు సాధారణ నిర్వహణ పనులు నిర్వహించనున్నారు.
ఈ పనులు తేది: 08.01.2026, గురువారం ఉదయం 10 గంటల నుంచి తేదీ 09.01.2026 శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు చేపడతారు.
కావున ఈ 18 గంటలు కింద పేర్కొన్న ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది.
హైదరాబాద్ లో తాగునీరు సరఫరాలో అంతరాయం ఏర్పడే ప్రాంతాలు:
1. ఓ అండ్ ఎం డివిజన్ 15 : మలేషియన్ టౌన్‌షిప్, మాదాపూర్, కొండాపూర్, డోయెన్స్ సెక్షన్, మాదాపూర్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB).
2. ఓ అండ్ ఎం డివిజన్ 9 : భరత్ నగర్, మూసాపేట సెక్షన్, గాయత్రీ నగర్ సెక్షన్, బాలానగర్ సెక్షన్, కేపిహెచ్ బి కొంత భాగం, బాలాజీ నగర్ సెక్షన్ కొంత భాగం.
3. ఓ అండ్ ఎం డివిజన్ 6 : ఫతేనగర్.
4. ఓ అండ్ ఎం డివిజన్ 17 : గోపాల్ నగర్, హఫీజ్‌పేట్ సెక్షన్, మయూరి నగర్ మరియు మియాపూర్ సెక్షన్.
5. ఓ అండ్ ఎం డివిజన్ 22: ప్రగతినగర్ సెక్షన్, మరియు మైటాస్.
6. ట్రాన్స్‌మిషన్ డివిజన్ 2: BHEL, MIG-I & II, రైల్ విహార్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, చందానగర్.
కావున అంతరాయం ఏర్పడనున్న ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోగలరని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ కోరింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
