Watch Video: హైదరాబాద్ జూ పార్క్‎లో జంతువులకు ప్రత్యేక ఏర్పాట్లు.. సందర్శకుల టికెట్ ధర ఎంతంటే..

ఎండలు మండుతున్నాయి.. జనం బయటికి రావాలంటేనే జంకుతున్నారు. అలాంటిది జంతువుల పరిస్థితి ఏంటి? భగభగ మండే ఎండలు జూ పార్కులో ఉండే జంతువులను, పక్షులను భయపెడుతున్నాయి. అందుకే హైదరాబాదులోని నెహ్రు జూ పార్క్‎లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు జూ అధికారులు. వన్యప్రాణుల చల్లదనం కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారో టీవీ9 స్పెషల్ స్టోరీ..

Watch Video: హైదరాబాద్ జూ పార్క్‎లో జంతువులకు ప్రత్యేక ఏర్పాట్లు.. సందర్శకుల టికెట్ ధర ఎంతంటే..
Zoo Park
Follow us

| Edited By: Srikar T

Updated on: Apr 27, 2024 | 4:04 PM

ఎండలు మండుతున్నాయి.. జనం బయటికి రావాలంటేనే జంకుతున్నారు. అలాంటిది జంతువుల పరిస్థితి ఏంటి? భగభగ మండే ఎండలు జూ పార్కులో ఉండే జంతువులను, పక్షులను భయపెడుతున్నాయి. అందుకే హైదరాబాదులోని నెహ్రు జూ పార్క్‎లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు జూ అధికారులు. వన్యప్రాణుల చల్లదనం కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారో టీవీ9 స్పెషల్ స్టోరీ..

హైదరాబాదులో వేసవి తాపానికి వన్యప్రాణులు అల్లాడిపోతున్నాయి. మూగజీవాల రక్షణ కోసం నెహ్రూ పార్కు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. ఇక్కడున్నటువంటి జంతువులకు ఎండతాపం తెలియకుండా జాగ్రత్తగా కాపాడుతున్నారు. పక్షులకు ఎండ వేడిమి తెలియకుండా వాటర్ స్ప్రింక్లర్స్‎తో పాటు కింద గడ్డిని వేశారు. సింహాలు, పులులు, రాయల్ బెంగాల్ టైగర్‎లకు ఎండ తెలియకుండా వాటర్ ఫాల్ వచ్చేలాగా ఎయిర్ కూలర్స్‎ను, వాటర్ ఫాల్స్‎ను ఏర్పాటు చేశారు. ఈ జూ పార్కులో జిరాఫీ ఉన్న ప్రదేశంలో వాటర్ స్ప్లింకర్స్‎ను ఏర్పాటు చేశారు. అదే రకంగా ఏనుగు, ఎలుగుబంటి ఉన్న చోట కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకున్నారు. అవి ఎండ వేడిమికి డిహైడ్రేడ్ అవ్వకుండా ఏ జంతువు దానికి అనుగుణంగా తినే ఆహార పదార్థాలను అందిస్తున్నారు. చిలకలకు వాటర్ మిలన్ పై డి విటమిన్, గ్లూకోన్ డీ వేసి ఆహారంగా ఇస్తున్నారు. కొన్నేళ్లుగా ఖడ్గమృగం ఈ జూ పార్క్ లోనే జీవిస్తోంది. ఈ ఖడ్గ మృగం కోసం ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. ఎండ వేడిని తట్టుకోలేక పులులు, సింహాలు నీళ్లల్లో దిగుతూ అహ్లాదాన్ని పొందుతున్నాయి. ఈ విధంగా ఎండ వేడి నుండి వన్యప్రాణులకు రక్షణ కలిగిస్తున్నారు జూ పార్క్ అధికారులు.

ఈ జూ పార్క్ ఈ మధ్యనే 60 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు కోట్లాదిమంది ప్రజలు ఈ జూ పార్కును సందర్శించారు. ఇండియాలోనే మన హైదరాబాద్ నెహ్రూ జూ పార్క్ నెంబర్ వన్ ప్లేస్‎లో ఉంది. ఈ జూ పార్క్‎లో 2300ల వన్యప్రాణులు ఉన్నాయి. అందులో వివిధ రకాల జాతులకు చెందినటువంటి వన్యప్రాణులు 170 కి పైగా ఉన్నాయి. వేసవి సెలవులు కావడంతో జూ పార్క్‎కు పర్యాటకులు క్యూ కడుతున్నారు. రోజుకు మూడు వేల నుంచి పదివేల మంది పర్యాటకులు సందర్శిస్తున్నారు. శని ఆదివారాల్లో ఈ సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. పక్షులు, జంతువులు తినే ఆహారం నుంచి ప్రతిదీ జాగ్రత్త వహిస్తూ చర్యలు తీసుకుంటున్నామని జూక్యూరేటర్ సునీల్ కుమార్ చెప్పారు.

ఇవి కూడా చదవండి

జూకి ఎంటర్ అయ్యేటప్పుడు పెద్ద వాళ్లకు రూ.70 రూపాయలు టికెట్ ఉండగా 10 సంవత్సరాల పైబడిన వారికి రూ.40 రూపాయల టికెట్ ఉంటుంది. అదే శని, ఆదివారాల్లో అయితే పెద్దవాళ్లకు రూ.80 రూపాయల టికెట్టు ఉంటుంది. లోపలికి వెళ్లిన తర్వాత జూ పార్కు అంతా చుట్టి చూపించేందుకు మోటార్ వెహికల్స్ ఉంటాయి. ఆ మోటర్ వెహికల్‎కు రూ.110 అదనంగా చెల్లిస్తే 10 మంది కూర్చొని జూ అంతా చుట్టేయొచ్చు. అదేవిధంగా ఒక మినీ ట్రైన్ ని కూడా జూ పార్కులో ప్రత్యేకంగా ఉంచారు. ఎవరైతే నడవలేని వారు ఉంటారో వాళ్లు పార్క్ లో ఉన్న మినీ ట్రైన్లో మోటర్ వెహికల్స్‎ను ఎక్కి జూ అంత సందర్శిస్తారు. అంతేకాకుండా లోపల తాగేందుకు మంచినీటి సదుపాయము, తినేందుకు స్టాల్స్‎ను పర్యాటకులకు అందుబాటులో ఉంచారు జూ అధికారులు. ఈ విధంగా వేసవిలో ఎండ తాపానికి జంతువులకు పక్షులకు ఉపశమనం కల్పిస్తూ వచ్చే పర్యాటకులకు ఇబ్బందులు కలగకుండా జూ అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..