Etela Rajendar: రేవంత్ రెడ్డికి ఈటెల సవాల్.. అలా అయితే రాజకీయాల నుండి తప్పుకుంటా..!
మల్కాజ్‌గిరి ఎంపీ స్థానానికి నామినేషన్ వేసిన బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించిన ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో భూములు అమ్మకుండా రుణమాఫీ చేస్తే రాజకీయాల నుండి తప్పుకుంటా అంటూ రేవంత్ ప్రభుత్వానికి ఛాలెంజ్ చేశారు ఈటెల .
మల్కాజ్‌గిరి ఎంపీ స్థానానికి నామినేషన్ వేసిన బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. మల్కాజ్‌గిరి గడ్డపై ఎగిరేది కాషాయ జెండానే అన్నారు ఈటల. మేడ్చల్ అసెంబ్లీ నియోజికవర్గం దమ్మాయిగూడ మున్సిపాలిటీలో రోడ్ షో నిర్వహించిన ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో భూములు అమ్మకుండా రుణమాఫీ చేస్తే రాజకీయాల నుండి తప్పుకుంటా అంటూ రేవంత్ ప్రభుత్వానికి ఛాలెంజ్ చేశారు ఈటెల రాజేందర్.
మోదీ ఏంది గీడీ ఏంది అన్న కేసీఆర్ పరిస్థితి ఏంటో చూస్తున్నాం. ఈరోజు రేవంత్ రెడ్డి కూడా అలాగే మాట్లాడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి అనేక హామీలు ఇచ్చారు. వాటిలో ఒక్క ఆర్టీసీ ఫ్రీ బస్ తప్ప ఇంకే పథకం అమలుకావడం లేదన్నారు. ఒక్క హామీ అమలు చేయకుండా మళ్లీ ఒచ్చి ఓట్లు అడుగుతున్నారు. 17 సీట్లు గెలిపించండి హామీలు అమలు చేస్తా అంటున్నారు. వారు గెలిచేది లేదు మాట నిలబెట్టుకునేది లేదున్నారు ఈటల.
అంతకు ముందు కూకట్‌పల్లి కోర్టులో అడ్వకేట్లను కలిసి వచ్చే ఎన్నికలలో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని ఈటెల రాజేందర్ కోరారు. బార్ కౌన్సిల్ సభ్యులను, న్యాయవాదులను కలిసి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం సాధించిన పురోగతులను వివరించారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే డబ్బు, మద్యం నమ్ముకున్నాడో, అదే విధంగా నేడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ డబ్బును మద్యాన్ని నమ్ముకున్నట్లు కనపడుతుందని ఆరోపించారు. నాలుగు నెలల క్రితం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు నేడు చేస్తున్న చేతలకు సంబంధం లేకుండా పోయిందన్నారు. అతి తక్కువ కాలంలోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోతున్న ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నిలుస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి వేసే ఓటు వాల్యూ జీరో అని, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వారు దేశంలో చేసేదేమీ లేదని అందుకే అబ్ కీ బార్ చార్ సౌ పార్ అనే నినాదంతో ప్రజలే మోదీని, తనని గెలిపిస్తారని ఈటెల రాజేందర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో న్యాయవాదులు ముందు వరుసలో ఉండి పోరాడారని, ఆనాడు ఈటెల రాజేందర్ సైతం పోరాటంలో ముందు వరుసలో ఉన్నాడని పలువురు న్యాయవాదులు గుర్తు చేశారు. అదే విధంగా బీజేపీ నినాదం అయిన అబ్ కి బార్ చార్ సౌ పార్, ఫర్ ఎక్ బార్ మోదీ సర్కార్ అనే నినాదానికి తాము సైతం మద్దతు తెలుపుతున్నామని తెలంగాణ బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ సునీల్ గౌడ్ తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…