Lok Sabha Election: కాంగ్రెస్ – సీపీఎం మద్య కుదిరిన దోస్తీ.. ఆ నియోజకవర్గం మినహా అన్నిచోట్ల మద్దతు!
తెలంగాణలోని తాజా రాజకీయ పరిణామాలపై సీపీఎం నేతలతో చర్చించామన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, వీరయ్యతోపాటు పలువురు కీలక నేతలు సీఎం నివాసంలో రేవంత్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా.. పార్లమెంట్ ఎన్నికల్లో మద్దతుపై చర్చించారు. భువనగిరి పార్లమెంట్‌తో పాటు ఇతర స్థానాల్లోనూ సంపూర్ణ మద్దతు ఇవ్వాలని సీపీఎం నేతలను కోరినట్లు చెప్పారు సీఎం రేవంత్‌రెడ్డి
పార్లమెంట్ ఎన్నికల పొత్తుపై తెలంగాణ కాంగ్రెస్ ప్రయత్నాలు ఫలించాయి. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి నడిచేందుకు కామ్రేడ్స్ సిద్ధమయ్యారు. ఇండియా కూటమిలో భాగమైన సీపీఐ, సీపీఎంను టీ.కాంగ్రెస్ నేతలు మద్దతు కోరారు తెలంగాణలో బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్‌తో కలిసి నడుస్తామని లెఫ్ట్ పార్టీలు ప్రకటించాయి. అయితే.. ఒక పార్లమెంట్ స్థానంలో మాత్రం షరతులు వర్తి్స్తాయంటున్నారు సీపీఎం నేతలు.
తెలంగాణలోని తాజా రాజకీయ పరిణామాలపై సీపీఎం నేతలతో చర్చించామన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, వీరయ్యతోపాటు పలువురు కీలక నేతలు సీఎం నివాసంలో రేవంత్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా.. పార్లమెంట్ ఎన్నికల్లో మద్దతుపై చర్చించారు. భువనగిరి పార్లమెంట్‌తో పాటు ఇతర స్థానాల్లోనూ సంపూర్ణ మద్దతు ఇవ్వాలని సీపీఎం నేతలను కోరినట్లు చెప్పారు సీఎం రేవంత్‌రెడ్డి. ఎన్నికల్లో మద్దతుకు బదులుగా సీపీఎం నేతల ముందు కొన్ని రాజకీయ ప్రతిపాదనలు పెట్టామన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డితో భేటీలో కీలక రాజకీయ అంశాలపై చర్చించామన్నారు తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. భువనగిరి పార్లమెంట్ స్థానంలో మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ కోరగా.. దానికి తాము అంగీకరించలేదని చెప్పారు. భువనగిరి సీటు విషయంలో సందిగ్ధం ఉన్నప్పటికీ.. మిగతా 16 స్థానాల్లో కాంగ్రెస్‌కు సీపీఎం మద్దతు కొనసాగుతుందని ప్రకటించారు తమ్మినేని వీరభద్రం.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యేక స్ట్రాటజీలతో ముందుకెళ్ళి తెలంగాణ కాంగ్రెస్ సక్సెస్ అయ్యింది. ఇప్పుడు అవే స్ట్రాటజీలను పార్లమెంట్ ఎన్నికల్లోనూ అమలు చేయబోతోంది. దానిలో భాగంగా.. సీపీఐ, సీపీఎంతో పొత్తు చర్చలు జరిపింది కాంగ్రెస్. ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సీపీఐ, సీపీఎం ముఖ్య నేతలతో చర్చలు జరిపారు. ఆ తర్వాత.. ఇరు పార్టీల నేతలు పొత్తులకు సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ ఎన్నికల్లో మద్దతుపై హైదరాబాద్‌లో సీపీఎం నేతలతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. సీపీఐ, సీపీఎం నేతలను కూడా ప్రత్యేకంగా ఆహ్వానించడంతో మూడు పార్టీల నేతలు ఈ ఎన్నికల్లో మద్దతుపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పనిచేయాలని మూడు పార్టీల నేతలు డిసైడ్ అయ్యారు. బీజేపీని తెలంగాణలో అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు కాంగ్రెస్‌తో కలిసి పని చేస్తామని సీపీఐ, సీపీఎం పార్టీ నేతలు వెల్లడించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..