AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లోక్ సభ ఎన్నికల వేళ ఈ నేతల మధ్య కొనసాగుతున్న సవాళ్ల పర్వం..

పార్లమెంట్‌ ఎన్నికల వేళ తెలంగాణలో సవాళ్లపర్వం పీక్‌ స్టేజ్‌కు చేరుతోంది. ఇప్పటికే.. బీఆర్ఎస్‌- కాంగ్రెస్‌ మధ్య సవాళ్లు హోరాహోరీగా కొనసాగుతుండగా.. తాజాగా బీజేపీ సీనియర్‌ నేత, ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌ కూడా ఎంట్రీ ఇచ్చారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్న కాంగ్రెస్‌.. అమలు చేసినట్లు నిరూపిస్తే తాను పోటీ నుంచి తప్పుకుంటానని బండి సంజయ్‌ ప్రకటించారు.

లోక్ సభ ఎన్నికల వేళ ఈ నేతల మధ్య కొనసాగుతున్న సవాళ్ల పర్వం..
Bandi Sanjay
Srikar T
|

Updated on: Apr 27, 2024 | 3:36 PM

Share

పార్లమెంట్‌ ఎన్నికల వేళ తెలంగాణలో సవాళ్లపర్వం పీక్‌ స్టేజ్‌కు చేరుతోంది. ఇప్పటికే.. బీఆర్ఎస్‌- కాంగ్రెస్‌ మధ్య సవాళ్లు హోరాహోరీగా కొనసాగుతుండగా.. తాజాగా బీజేపీ సీనియర్‌ నేత, ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌ కూడా ఎంట్రీ ఇచ్చారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్న కాంగ్రెస్‌.. అమలు చేసినట్లు నిరూపిస్తే తాను పోటీ నుంచి తప్పుకుంటానని బండి సంజయ్‌ ప్రకటించారు. ఆరు గ్యారెంటీలు అమలు చేసినట్లు కాంగ్రెస్‌ నేతలు నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుని.. కాంగ్రెస్‌ తరపున ప్రచారానికి సిద్ధమన్నారు. తన సవాల్‌ను స్వీకరించే దమ్ము కాంగ్రెస్‌ నేతలకు ఉందా అని ఛాలెంజ్‌ విసిరారు బండి సంజయ్‌. అరు గ్యారెంటీలలో భాగంగా తెలంగాణ రాష్ట్ర మహిళలకు నెలకు రూ. 2500 బ్యాంకు అకౌంట్లలో వేస్తామన్నారు. వాటిని ఏ ఒక్క మహిళల ఖాతాలోనైనా వేసినట్లు నిరూపించండని డిమాండ్ చేశారు. అలాగే ఆసరా పెన్షన్లో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ రూ. 4000 అకౌంట్లలో వేస్తామన్నారు. అలా ఈ పథకం ఏ ఒక్కరికైనా అందించినట్లు చూపించమని కోరారు. ఈ రెండింటినీ నిరూపిస్తే తాను కరీంనగర్ ఎంపీగా పోటీ నుంచి తప్పుకుంటానని చెప్పారు.

ఇదిలా ఉంటే బీఆర్ఎస్ కీలక నేత మాజీ మంత్రి హరీష్ రావు కూడా తన రాజీనామా లేఖను గన్ పార్క్ వద్ద ప్రదర్శించారు. ఆగస్ట్ 15లోపు రైతుల రూ. 2లక్షల రుణాలు మాఫీ చేస్తే తన పదవికి రాజీనామా చేస్తానని, ఒకవేళ చేయలేకపోతే సీఎం పదవికి రేవంత్ రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. దీనిపై కాంగ్రెస్ నేతలు స్పందించారు. రాజీనామా లేఖ స్పీకర్ ఫార్మెట్లో లేదని, అది చెల్లదని కౌంటర్ వేశారు. ముఖ్యమంత్రి రేవంత్ కూడా రాజీనామా లేఖ జేబులో పెట్టుకో అని ఎద్దేవా చేశారు. ఇలా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో రాజకీయం రసవత్రంగా మారింది.

బండి సంజయ్ వీడియో..

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి…