Congress: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు సమ్మర్ ఎఫెక్ట్.. ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ప్రత్యేక వినతి..!

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఏప్రిల్ మొదటివారం నుంచే 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతూ వస్తున్నాయి. సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

Congress: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు సమ్మర్ ఎఫెక్ట్.. ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ప్రత్యేక వినతి..!
Heatwave
Follow us

|

Updated on: Apr 27, 2024 | 4:41 PM

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఏప్రిల్ మొదటివారం నుంచే 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతూ వస్తున్నాయి. సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. ఈ క్రమంలోనే.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు కూడా దగ్గరపడుతున్నాయి. ఇప్పుడే.. ఇలా ఉంటే.. మున్ముందు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ సూచనలతో కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది..

సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కు లేఖ రాసిన కాంగ్రెస్ పార్టీ.. రాష్ట్రంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పోలింగ్ అవర్స్ ను పెంచాలని కోరింది. ఎండల వల్ల పలు రాష్ట్రాల్లో పోలింగ్ సమాయాన్ని సైతం మార్చినట్లు కాంగ్రెస్ వెల్లడించింది. తెలంగాణలో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ పెట్టాలని విజ్ఞప్తి చేసింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సైతం ఒక గంట పెంచుతూ నాలుగు గంటల వరకు పోలింగ్ జరిగేలా అనుమతి ఇవ్వాలని కాంగ్రెస్ లేఖలో విన్నవించింది.

కాగా.. మే 13న తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు, ఏపీలో లోక్ సభతోపాటు.. అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఆయా పార్టీల అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేసి.. ప్రచారం స్పీడును పెంచాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పార్టీలు అన్ని ప్రాంతాల్లో సభలు నిర్వహిస్తూ.. ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎండలు ఉన్నప్పటికీ.. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు పాట్లు పడుతున్నారు.. వచ్చే 10 రోజులు కీలకం కానున్న నేపథ్యంలో ప్రచారాన్ని మరింత హోరెత్తించనున్నారు.

అయితే, కాంగ్రెస్ అభ్యర్థనపై ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తుందో .. చూడాల్సి ఉంది..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..