AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: స్టీల్ బ్రిడ్జిను ఆనుకుని ఉన్న లేడిస్ హాస్టల్.. రెచ్చిపోతున్న పోకిరీలు.. ఇక నుంచి ఈ వేళల్లో రాకపోకలు బంద్

ఇటీవలే ఇందిరా పార్క్, వీఎస్టీ ప్రాంతాలను కలుపుతూ స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభించారు మంత్రి కేటీఆర్. 450 కోట్లతో 2.6 కిలోమీటర్ల పొడవుతో స్టీల్ బ్రిడ్జిని నిర్మించారు. ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దేందుకు ఇలాంటి అభివృద్ధి పనులు ఎన్నో నగరంలో జరుగుతున్నాయి. మాజీ హోంమంత్రి నాయుని నరసింహారెడ్డి పేరు మీదుగా నిర్మించిన ఈ స్టీల్ బ్రిడ్జి గ్రేటర్ హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ విద్యా నగర్ల మధ్య ఉన్న సంవత్సరాల కాలాల నాటి ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్ పెడుతుంది.

Hyderabad: స్టీల్ బ్రిడ్జిను ఆనుకుని ఉన్న లేడిస్ హాస్టల్.. రెచ్చిపోతున్న పోకిరీలు.. ఇక నుంచి ఈ వేళల్లో రాకపోకలు బంద్
Steel Bridge
S Navya Chaitanya
| Edited By: Aravind B|

Updated on: Aug 24, 2023 | 12:13 PM

Share

ఇటీవలే ఇందిరా పార్క్, వీఎస్టీ ప్రాంతాలను కలుపుతూ స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభించారు మంత్రి కేటీఆర్. 450 కోట్లతో 2.6 కిలోమీటర్ల పొడవుతో స్టీల్ బ్రిడ్జిని నిర్మించారు. ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దేందుకు ఇలాంటి అభివృద్ధి పనులు ఎన్నో నగరంలో జరుగుతున్నాయి. మాజీ హోంమంత్రి నాయుని నరసింహారెడ్డి పేరు మీదుగా నిర్మించిన ఈ స్టీల్ బ్రిడ్జి గ్రేటర్ హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ విద్యా నగర్ల మధ్య ఉన్న సంవత్సరాల కాలాల నాటి ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్ పెడుతుంది. కానీ ఇప్పుడు ఈ స్టీల్ బ్రిడ్జితో తిప్పలు మొదలయ్యాయి. ఈ వంతెనను ఆనుకొని ఒక లేడీస్ హాస్టల్ ఉంది. పోకిరీలు ఈ లేడీస్ హాస్టల్‎ను టార్గెట్ గా చేసుకుని రాత్రివేళ రెచ్చిపోతున్నారు. ఇద్దరు వ్యక్తులు మద్యం సేవించి హాస్టల్లో మెట్ల పైకి వచ్చిన అమ్మాయి పైకి బీర్ బాటిల్ విసిరారు. ఈ దృశ్యాలు హాస్టల్ పరిసరాల్లో ఉన్న బేకరీ వద్ద సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇక దీంతో హాస్టల్లో ఉన్న అమ్మాయిలు భయాందోళనకు గురవుతున్నారు.

అందువల్ల స్టీల్ బ్రిడ్జిపై రాకపోకలు రాత్రివేళ నిలిపివేయాలని అధికారులు నిర్ణయించారు. అయితే ఇక ప్రతిరోజు రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు స్టీల్ బ్రిడ్జి పై రాకపోకలు బంద్ కానున్నాయి. దీంతో ఇక ఆకతాయిల పోకిరి చేష్టలకు చెక్ పడనుంది.ఇదిలా ఉండగా ఎస్‌ఆర్‌డీపీలో 48 ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఇందులో ఇప్పటి వరకు 35 ప్రాజెక్టులయ్యాయి. VST ఫ్లై ఓవర్‌ 36వది. అయితే, వాటిలో 19 ఫ్లై ఓవర్లు, ఐదు అండర్‌పాస్‌లు, 7 ఆర్వోబీ/ఆర్‌యూబీ, ఒక కేబుల్‌ బ్రిడ్జి, పంజాగుట్ట స్టీల్‌ బ్రిడ్జి, పంజాగుట్ట రహదారి, ఓఆర్‌ఆర్‌ మెదక్‌ రోడ్‌ కూడా ఉంది. 20వ ఫ్లై ఓవర్‌గా ఈ స్టీల్‌ బ్రిడ్జి నిలిచింది.

SRDPలో ఫ్లై ఓవర్‌ అవసరాన్ని బట్టి స్టీల్‌ను ఉపయోగించారు . బంజారాహిల్స్‌ శ్మశాన వాటిక, మల్కం చెరువు సమీపంలో చేపట్టిన వంతెనకు కొంత మేరలో స్టీల్‌ వినియోగించగా.. ఈ ఫ్లై ఓవర్‌కు దాదాపు 20 మెట్రిక్‌ టన్నుల ఉక్కును వినియోగించారు. దక్షిణాది రాష్ట్రాల్లో మొదటి పొడవైన స్టీల్ వంతెన ఇది కావడం గమనార్హం. అంతే కాకుండా జీహెచ్‌ఎంసీ చరిత్రలో అసలు భూసేకరణ అనేదే లేకుండా నిర్మాణం చేపట్టిన ప్రాజెక్టు కూడా ఇదే కావడం విశేషం. అలాగే మైట్రో రైల్‌ మార్గం మీదుగా నిర్మించిన మొదటి ఫ్లై ఓవర్‌ కావడం మరో విశేషం. ఈ ఫ్లై ఓవర్‌ అందుబాటులోకి రావడం వల్ల సికింద్రాబాద్‌, తార్నాక, ఓయూ, చర్లపల్లి, అంబర్‌పేట, రామంతపూర్‌, ఉప్పల్‌ మీదుగా వరంగల్‌ వైపు వెళ్లే వారికి ప్రయాణం సులభతరం అవుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి