LB Nagar Road Accident: అర్ధరాత్రి ఎల్బీనగర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. రోడ్డుపై పల్టీలు కొట్టిన కారు! ఆ తర్వాత..
వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని బిన్ రెడ్డి నగర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బీఎన్‌రెడ్డి నగర్ సమీపంలోని గుర్రంగూడ దగ్గర శనివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఇందులో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. థార్ కారులోని డైవర్ మద్యం మత్తులో..

హైదరాబాద్, అక్టోబర్ 12: హైదరాబాద్‌లోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని బిన్ రెడ్డి నగర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బీఎన్‌రెడ్డి నగర్ సమీపంలోని గుర్రంగూడ దగ్గర శనివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఇందులో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. థార్ కారులోని డైవర్ మద్యం మత్తులో ఇంజాపూర్ నుంచి గుర్రంగూడ వైపు వెళ్తున్నాడు. రోడ్డుపై అతివేగంగా వెళ్తూ అదుపు తప్పి ముందుగా బైక్‌పై వెళ్తున్న సిరిసిల్లకు చెందిన ఇద్దరు విద్యార్థులను ఢీ కొట్టాడు.
అనంతరం డివైడర్ దాటి మరో కారును ఢీ కొట్టింది. దీంతో కారు రోడ్డుపై మూడు పల్టీలు కొట్టి పడిపోయింది. ఆ కారులోని డ్రైవర్, యజమాని అనిరుధ్ తలకు తీవ్రగాయాలయ్యాయి. మరో కారులోని దినేష్, శివలు సైతం గాయపడ్డారు. ఇక బైక్ ప్రయాణిస్తున్న విద్యార్థినికి తీవ్రగాయాలు కావడంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిని హస్తినాపురంలోని రెండు ఆస్పత్రులకు తరలించి, చికిత్స అందిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.








