AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికకు అక్టోబర్ 13న నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్ మహానగరం పరిధిలోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సోమవారం (అక్టోబర్ 13) ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. సోమవారం అక్టోబర్ 13 నుంచి ఈ నెల 21 వరకు ప్రభుత్వ సెలవు దినాలు మినహా నామినేషన్లను స్వీకరిస్తారు. అభ్యర్థులు తమ నామినేషన్లను షేక్ పేట్ ఎమ్మార్వో కార్యాలయంలో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ ఆఫీస్‌లో సమర్పించాల్సి ఉంటుంది.

జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికకు అక్టోబర్ 13న నోటిఫికేషన్ విడుదల
Jubilee Hills By Election
Balaraju Goud
|

Updated on: Oct 12, 2025 | 6:24 PM

Share

హైదరాబాద్ మహానగరం పరిధిలోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సోమవారం (అక్టోబర్ 13) ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. సోమవారం అక్టోబర్ 13 నుంచి ఈ నెల 21 వరకు ప్రభుత్వ సెలవు దినాలు మినహా నామినేషన్లను స్వీకరిస్తారు. అభ్యర్థులు తమ నామినేషన్లను షేక్ పేట్ ఎమ్మార్వో కార్యాలయంలో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ ఆఫీస్‌లో సమర్పించాల్సి ఉంటుంది. నామినేషన్ల ప్రక్రియను పూర్తి చేసేందుకు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అర్హత కలిగిన అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలని ఎన్నికల అధికారులు తెలిపారు.

అక్టోబర్ 22న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. అలాగే అక్టోబర్ 24వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. అదే రోజు సాయంత్రం అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగనుంది. నవంబర్ 14న యూసఫ్ గూడలోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేసి ఫలితాలను అదే రోజు ప్రకటిస్తారు.

ENCORE పోర్టల్ ద్వారా డిజిటల్ నామినేషన్ సమర్చించేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. అభ్యర్థులు https://encore.eci.gov.in ద్వారా నామినేషన్ ఫారం ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. అయితే QR కోడ్‌తో కూడిన ప్రింటెడ్ హార్డ్ కాపీ తప్పనిసరిగా సమర్పించాలని ఎన్నికల అధికారులు తెలిపారు. ఆన్‌లైన్ డిపాజిట్ బ్యాంక్/ట్రెజరీలో క్రెడిట్ అయి ఉండాలి; లేకపోతే మాన్యువల్ డిపాజిట్ చేయాలి. మరిన్ని వివరాలకు రిటర్నింగ్ ఆఫీసర్‌ను సంప్రదించాలన్నారు.

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం తుది ఓటర్ల జాబితాను ఎన్నికల అధికారి, బీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఇప్పటికే విడుదల చేశారు. మొత్తం 3 లక్షల 98 వేల 982 మంది ఓటర్లు ఉండగా ఇందులో 2,07,367 మంది పురుష ఓటర్లు ఉండగా, 1.91,590 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అలాగే ఇతరులు 25 మంది ఉన్నారని ప్రకటించారు. నియోజకవర్గం ఓటర్లలో 80 ఏండ్లకు పైబడిన వృద్ధుల్లో పురుషులు 3,280 మంది, మహిళలు 2,772 మంది ఉన్నారు. ఇక ఎన్ఆర్ఐ ఓటర్లు 95 మంది కాగా, సర్వీస్ ఎలక్టోరల్స్ 18, పీడబ్ల్యూడీ ఓటర్లు 1,891 మంది నమోదయ్యారు. నియోజకవర్గంలో 407 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతితో అనివార్యమైన జూబ్లీహిల్ష్ ఎన్నికలు.. అన్ని రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఎవరికి వారు ఈ స్థానం కైవసం చేసుకునేందుకు వ్యూహ ప్రతివ్యూహాలతో సిద్ధమవుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
ఇకపై ఆధార్ కార్డు అవసరం లేదు.. కొత్త ఆధార్ యాప్.. ప్రత్యేకత ఏంటి?
ఇకపై ఆధార్ కార్డు అవసరం లేదు.. కొత్త ఆధార్ యాప్.. ప్రత్యేకత ఏంటి?