Hyderabad: వామ్మో.. హైదరాబాద్‌లో మరో ప్రమాదం.. గుంటూరు వెళ్తుండగా బోల్తా పడిన ట్రావెల్స్ బస్సు..
వరుస బస్సు ప్రమాదాలు వణికిస్తున్నాయి.. కర్నూలు బస్సు ప్రమాదం మరువకముందే.. వరుసగా చోటుచేసుకుంటున్న ప్రమాదాలు హడలెత్తిస్తున్నాయి.. తాజాగా.. మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ప్రమాదం ఒక్కసారిగా షాక్ కు గురిచేసింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై (ORR) పై ప్రైవేట్ బస్సు బోల్తా పడింది.

వరుస బస్సు ప్రమాదాలు వణికిస్తున్నాయి.. కర్నూలు బస్సు ప్రమాదం మరువకముందే.. వరుసగా చోటుచేసుకుంటున్న ప్రమాదాలు హడలెత్తిస్తున్నాయి.. తాజాగా.. మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ప్రమాదం ఒక్కసారిగా షాక్ కు గురిచేసింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై (ORR) పై ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. బస్సులో 15 మంది ప్రయాణికులున్నారు. పలువురు ప్రయాణికులకు గాయాలు కాగా.. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. న్యూగో ఎలక్ట్రిక్ బస్సు మియాపూర్ నుంచి గుంటూరు వెళుతుండగా.. ఈ ఘటన జరిగింది. పెద్ద అంబర్‌పేట్ దగ్గర బోల్తాపడిన న్యూగో ఎలక్ట్రిక్ బస్సు బోల్తపడింది..
ఓఆర్ఆర్ పెద్ద అంబర్ పెట్ దిగుతున్న సమయం కో రైలింగ్ కి బస్సు తాకడం వల్ల ప్రమాదం జరిగిందని.. రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. ఎవరికి ప్రాణాపాయం జరగలేదన్నారు. నలుగురికి చిన్న చిన్న గాయాలు అయ్యాయన్నారు.
వీడియో..
కాగా.. కర్నూలులో జరిగిన వీకావేరి బస్సు ప్రమాదంలో 20 మంది మరణించిన విషయం తెలిసిందే.. ఈ ఘటన అనంతరం కూడా 24 గంటల్లో వరుస ప్రమాదాలు జరగడం ఆందోళన కలిగిస్తోంది.. బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా శనివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో జీపీ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణికులంతా గాఢలో నిద్రలో ఉన్నారు. ముందున్న వాహనాన్ని తప్పించబోయి లారీని ఢీకొట్టింది.. బెంగళూరు నుంచి వస్తున్న బస్సు జడ్చర్ల దాటాక జరిగిన రోడ్డు ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. ఈ క్రమంలోనే.. హైదరాబాద్ లో మరో ప్రమాదం చోటుచేసుకోవడం కలకలం రేపింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




