AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heavy Rain Alert: మరో బాంబ్ పేల్చిన వాతావరణశాఖ.. వచ్చే 4 రోజులు కుండపోత వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో

మొంతా తుఫాను ముప్పు ముంచుకొస్తోంది.. బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్రంగా బలపడి వాయుగుండంగా మారిందని.. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా ఏపీకి ఎక్కువగా ముప్పు ఉందని పేర్కొంది..

Heavy Rain Alert: మరో బాంబ్ పేల్చిన వాతావరణశాఖ.. వచ్చే 4 రోజులు కుండపోత వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో
Rain Alert
Shaik Madar Saheb
|

Updated on: Oct 25, 2025 | 2:22 PM

Share

మొంతా తుఫాను ముప్పు ముంచుకొస్తోంది.. బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్రంగా బలపడి వాయుగుండంగా మారిందని.. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా ఏపీకి ఎక్కువగా ముప్పు ఉందని పేర్కొంది.. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. జాగ్రత్తగా ఉండలంటూ శనివారం ఐఎండీ ప్రకటన విడుదల చేసింది. తీవ్ర వాయుగుండంగా.. మారి ఏపీ తీరాన్ని తాకే అవకాశం ఉందని పేర్కొంది..  వాయుగుండం ఏపీ తీరం వైపు కదులుతుందని.. తీవ్ర తుఫానుగా మారి ఏపీ తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఈనెల 28 సాయంత్రం తుఫాను తీరం దాటనుంది. కళింగపట్నం – మచిలీపట్నం మధ్య కాకినాడ సమీపంలో తుఫాను తీరం దాటనుంది. తుఫాను తీవ్ర తుఫానుగా మారి తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. వాయుగుండం రేపటికి తీవ్ర వాయుగుండంగా.. 27 నాటికి తుపానుగా… 28 నాటికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది.. తుఫానుగా బలపడితే ‘మోంతా’ గా నామకరణం చేయనున్నారు.

వాయుగుండం ప్రస్తుతం పోర్ట్ బ్లెయిర్ కి పశ్చిమ-నైరుతి దిశలో 440 కి.మీ., చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 970, విశాఖ కి ఆగ్నేయ దిశలో 970 కి.మీ., కాకినాడ కి ఆగ్నేయంగా 990 కి.మీ., గోపాల్‌పూర్ (ఒడిశా) కి ఆగ్నేయంగా 1040 కి.మీ. దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం పేర్కొంది.

ఏపీలో భారీ వర్షాలు..

కాగా తుఫాన్‌ హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తం అయ్యింది. జిల్లా, మండల అధికారులతో విశాఖ కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాబోయే 3 రోజులు అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారుల హెచ్చరికలు జారీ చేశారు.

ఏపీలో వచ్చే నాలుగు రోజులపాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.. కోస్తాకు భారీ వర్ష సూచన చేసింది. కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్, మరికొన్ని ఆరెంజ్, ఇంకొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కోస్తా జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

తెలంగాణలో రాగల 3 రోజులకు వాతావరణ సూచన:

తెలంగాణాలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈరోజు, రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి రాష్ట్రం లోని చాలా జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. సోమవారం రాష్ట్రంలోని కొన్ని ఉత్తర, ఈశాన్య జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. శనివారం, ఆదివారం, సోమవారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు , 30 నుండి 40 కి.మీ వేగంతో కలిగిన ఈదురు గాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి