మరో లంచగొండి అధికారి ఏసీబీకి చిక్కాడు.. మిమ్మల్ని ఎవరైనా లంచం అడిగితే ఈ నంబర్‌కు కాల్ చేయండి

తాజాగా.. హైదరాబాద్‌లో మరో అవినీతి అధికారి ACB అధికారులకు పట్టుబడ్డాడు. కమర్షియల్ బిల్డింగ్‌ను నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు రూ.5 లక్షల లంచం డిమాండ్‌ చేసిన నీటిపారుదల శాఖ కార్యనిర్వాహక డిప్యూటీ ఇంజినీరు యాత పవన్‌కుమార్‌ను ACB అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తన ఆఫీసులో లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకొని రిమాండుకు తరలించారు.

మరో లంచగొండి అధికారి ఏసీబీకి చిక్కాడు.. మిమ్మల్ని ఎవరైనా లంచం అడిగితే ఈ నంబర్‌కు కాల్ చేయండి
Hyderabad
Follow us
Ranjith Muppidi

| Edited By: Srikar T

Updated on: Apr 27, 2024 | 5:40 PM

తాజాగా.. హైదరాబాద్‌లో మరో అవినీతి అధికారి ACB అధికారులకు పట్టుబడ్డాడు. కమర్షియల్ బిల్డింగ్‌ను నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు రూ.5 లక్షల లంచం డిమాండ్‌ చేసిన నీటిపారుదల శాఖ కార్యనిర్వాహక డిప్యూటీ ఇంజినీరు యాత పవన్‌కుమార్‌ను ACB అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తన ఆఫీసులో లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకొని రిమాండుకు తరలించారు. రామంతాపూర్‌కు చెందిన బిల్డర్‌ గోపగాని రమణమూర్తి ఉప్పల్‌ భగాయత్‌లోని శాంతినగర్‌లో కమర్షియల్ బిల్డింగ్ నిర్మిస్తున్నారు. ఆ భవనానికి NOC కోసం అప్లై చేసుకోగా.. పవన్‌కుమార్‌ రూ.5 లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

అంత డబ్బు అడిగేసరికి బాధితుడు రమణమూర్తికి ఏం చేయాలో అర్థం కాలేదు. తెలిసినవారు ఇచ్చిన సలహాతో.. ఏసీబీని ఆశ్రయించాడు. రమణమూర్తి శుక్రవారం బుద్ధభవన్‌లోని ఆఫీసులో పవన్‌కు రూ.4 లక్షలు ఇస్తుండగా అధికారులు కాపు కాసి పట్టుకున్నారు. డబ్బు స్వాధీనం చేసుకొని.. నాంపల్లిలోని ACB కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి లంచగొండి అధికారికి రిమాండ్ విధించింది. ఏ గవర్నమెంట్ ఉద్యోగి అయినా లంచం అడిగితే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1064 కాల్ చేయాలని ACB అధికారులు తెలిపారు. లంచం తీసుకోవడం మాత్రమే కాదు.. ఇవ్వడం కూడా నేరం. అందుకే లంచాలు ఇచ్చి.. పనులు చేయించుకోవాలని చూడకండి. మీకు ఇబ్బంది ఉంటే ఏసీబీ వద్దకు వెళ్లండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..