AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KTR: కాంగ్రెస్‌కు ఓ విధానం ఉందా? వాళ్లను ఏమనాలో అర్ధం కావట్లేదన్నారు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..

రేవంత్‌ రెడ్డి ఇంఛార్జీగా ఉన్న రెండు చోట్లా కాంగ్రెస్‌ ఓడుతుంది.. ఎన్నికల ముందు అభయహస్తం.. ఇప్పుడు భస్మాసురహస్తం రేవంత్‌ నైజం..అంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పేర్కొన్నారు. రుణమాఫీ అని డిసెంబర్‌ 9 వరకు మోసం 1 చూపించారు.. ఇప్పుడు ఆగస్ట్‌ 15లోపు రుణమాఫీ అంటూ మోసం 2 చూపిస్తున్నారు.. అంటూ కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు.

KTR: కాంగ్రెస్‌కు ఓ విధానం ఉందా? వాళ్లను ఏమనాలో అర్ధం కావట్లేదన్నారు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..
BRS Working president KTR
Shaik Madar Saheb
|

Updated on: Apr 27, 2024 | 6:13 PM

Share

రేవంత్‌ రెడ్డి ఇంఛార్జీగా ఉన్న రెండు చోట్లా కాంగ్రెస్‌ ఓడుతుంది.. ఎన్నికల ముందు అభయహస్తం.. ఇప్పుడు భస్మాసురహస్తం రేవంత్‌ నైజం..అంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పేర్కొన్నారు. రుణమాఫీ అని డిసెంబర్‌ 9 వరకు మోసం 1 చూపించారు.. ఇప్పుడు ఆగస్ట్‌ 15లోపు రుణమాఫీ అంటూ మోసం 2 చూపిస్తున్నారు.. అంటూ కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. శనివారం మీడియాతో చిట్‌చాట్‌లో ‌ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్. రాష్ట్రంలో కాంగ్రెస్‌పై తీవ్ర వ్యతిరేకత ఉందని…కేసీఆర్‌ ఉన్నప్పుడే బాగుండేదని ప్రజలు అనుకుంటున్నట్లు కేటీఆర్‌ చిట్‌చాట్‌లో తెలిపారు. మల్లారెడ్డి చాలా తెలివైన నేత అన్నారు కేటీఆర్. ‌ఈటలను మునగ చెట్టు ఎక్కించి కింద పడేయడం ఖాయన్నారు. కేరళలో వాపక్షాలను తిడుతున్న రాహుల్‌గాంధీ… మిగతా రాష్ట్రాల్లో వాళ్లతోనే ఎందుకు ఫ్రెండ్‌షిప్‌ చేస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు ఓ విధానం అంటూ ఉందా అని సెటైర్లు వేశారు కేటీఆర్‌. అలాగే కాంగ్రెస్‌ నేతలు తెలివి తక్కువ మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

144 రోజుల్లోనే కేసీఆర్‌ ఉంటే బాగుండని అందరూ తలుచుకుంటున్నారనని.. కేసీఆర్‌ రాష్ట్ర రాజకీయాల్ని శాసించే రోజు త్వరలోనే వస్తుందంటూ కేటీఆర్‌ పేర్కొన్నారు. ప్రాంతీయ పార్టీలే బీజేపీ రాజకీయాలకు చెక్‌ పెడుతున్నాయన్నారు. కడియం చేసిన ద్రోహం తీరని గాయమన్నారు. ఒకే కేసులో అరెస్టైన కేజ్రీవాల్‌ మంచివారు, కవిత చెడ్డవారా? కాంగ్రెస్‌కు ఓ విధానం అంటూ ఉందా? అంటూ ప్రశ్నించారు. కవిత అరెస్ట్‌ కరెక్టే అనడం చూస్తుంటే వాళ్లను ఏమనాలో అర్ధం కావట్లేదన్నారు. భడే భాయ్‌, చోటే భాయ్‌కి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

వీడియో చూడండి..

ఎన్నికలు ముగిసిన తర్వాత పార్టీ ప్లీనరీ ఉంటుంది.. ప్రాంతీయ పార్టీ 24ఏళ్లు పూర్తి చేసుకోవడం సాధారణవిషయం కాదు..అంటూ కేటీఆర్ అన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..