మద్యం మత్తులో లారీ డ్రైవర్ బీభత్సం.. జాతీయ రహదారిపై తప్పిన పెను ప్రమాదం!
మహబూబాబాద్ జిల్లాలో గ్రానైట్ లారీల బీభత్సం ప్రజలను హడలెత్తిపోయేలా చేస్తుంది. తాజాగా తొర్రూరులో మరో గ్రానైట్ లారీ బీభత్సం సృష్టించింది. మంగళవారం (అక్టోబర్ 21) తెల్లవారుజామున అతివేగంగా వచ్చిన లారీ డ్రైవర్ జాతీయ రహదారిపై డివైడర్ ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో లారీలో ఉన్న బారీ గ్రానైట్ రాళ్లు రహదారిపై చెల్లాచెదరగా పడిపోయాయి.

మహబూబాబాద్ జిల్లాలో గ్రానైట్ లారీల బీభత్సం ప్రజలను హడలెత్తిపోయేలా చేస్తుంది. తాజాగా తొర్రూరులో మరో గ్రానైట్ లారీ బీభత్సం సృష్టించింది. మంగళవారం (అక్టోబర్ 21) తెల్లవారుజామున అతివేగంగా వచ్చిన లారీ డ్రైవర్ జాతీయ రహదారిపై డివైడర్ ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో లారీలో ఉన్న బారీ గ్రానైట్ రాళ్లు రహదారిపై చెల్లాచెదరగా పడిపోయాయి. ఆ సమయంలో పక్కన ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రెండు రోజుల క్రితం ఇదే తొర్రూర్ సమీపంలో మరో గ్రానైట్ లారీ గొర్రెల మంద పైకి దూసుకెళ్లిన ఘటనలో 20 కి పైగా మూగజీవులు నుజ్జునుజ్జయ్యాయి.
ఈ ప్రమాదం తొర్రూరు బస్టాండ్ సమీపంలో జరిగింది. మంగళవారం తెల్లవారు జామున అతివేగంగా వచ్చిన లారీ డ్రైవర్ డివైడర్ ను ఢీ కొట్టాడు.. ఈ క్రమంలో గ్రానైట్ మొత్తం రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోగా లారీ ఇంజన్ భాగం నుజ్జునుజ్జయింది. డ్రైవర్, క్లీనర్ లకు తీవ్ర గాయాలవగా వారిని ఖమ్మంలోని ఓ ప్రైవేట్ హాస్పటిల్ కి తరలించారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉండడంతో వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఎలాంటి ప్రాణానష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చున్నారు. AP 39 UA 7299 గల గ్రానైట్ లారీ కరీంనగర్ నుండి వరంగల్ మీదుగా ఖమ్మం వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
అయితే రెండురోజుల క్రితం ఇదే తొర్రూరు సమీపంలో రహదారి పై గొర్రెల మంద పైకి లారీ దూసుకెళ్లిన ఘటనలో 20కి పైగా గొర్రెలు మృతి చెందాయి. గ్రానైట్ లారీల వరుస ఘటనలతో ఈ రహదారి పైన వెళ్లాలంటే ప్రజలు వణికిపోయే పరిస్థితి ఏర్పడింది. కాగా, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




