Telangana: మేకలు కాసేందుకు అడవిలోకి వెళ్లిన గిరిజనుడు.. ఎంతకు తిరిగిరాకపోవడంతో..
మహబూబాబాద్, ములుగు జిల్లా అడవుల్లో ఈ మధ్య అడవి దున్నల సంఖ్య భారీగా పెరిగింది.. అప్పుడప్పుడు హల్చల్ చేస్తున్న అడవిదున్నలు అమాయక ప్రజల ప్రాణాలు మింగేస్తున్నాయి.. తాజాగా మేకలను అడవిలో మేతకు తీసుకెళ్లిన పశువుల కాపరి ప్రాణాలు బలి తీసుకున్నాయి. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

మహబూబాబాద్, ములుగు జిల్లా అడవుల్లో ఈ మధ్య అడవి దున్నల సంఖ్య భారీగా పెరిగింది.. అప్పుడప్పుడు హల్చల్ చేస్తున్న అడవిదున్నలు అమాయక ప్రజల ప్రాణాలు మింగేస్తున్నాయి.. తాజాగా మేకలను అడవిలో మేతకు తీసుకెళ్లిన పశువుల కాపరి ప్రాణాలు బలి తీసుకున్నాయి. ఒక గొర్రెను హతమార్చిన అడవి దున్నలు.. ఆ గొర్రెల కాపరిని కూడా పొడిచి పొడిచి చంపడం కలకలం రేపింది. ఈ సంఘటన కొత్తగూడ మండలం కార్లవాయి గ్రామ సమీప అడవుల్లో జరిగింది.. కల్తి గోవిందు అనే గిరిజనుడు ఈనెల 18 నమేకలు కాయడానికి దగ్గర్లో ఉన్న అడవికి వెళ్లి మళ్లీ తిరిగి రాలేదు.. ఆ రోజు నుంచి గోవింద్ కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యులు, స్థానికులు అడవిలో గాలించడం మొదలు పెట్టారు.. ఈ క్రమంలో అటవీ ప్రాంతంలో కుళ్ళిపోయిన మృతదేహాన్ని గుర్తించారు.
కడుపులో నుండి పేగులు బయటికి రావడంతో అడవి దున్నలు పొడిచి చంపినట్లు గుర్తించారు. గోవింద్ దొడ్డివాడి పక్కనే ఒక మూగ జీవి కూడా చనిపోయి ఉంది. ఆ మూగ జీవిని కూడా కొమ్ములతో పొడిచంపిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి.. డెడ్ బాడీని గుర్తించిన గ్రామస్తులు పోలీసులు, ఫారెస్ట్ సిబ్బందికి సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కల్తి గోవిందు మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
కాగా.. అడవి దున్నల బారిన నుంచి ప్రజలను కాపాడేందుకు అటవీ అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




