AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇక్కడో వింత ఆచారం.. ఆడ-మగ కలిసి చేసే సంబరం.. ఎక్కడో తెలుసా?

తెలంగాణ రాష్ట్రంలో ఆశ్వయుజ మాసంలో బతుకమ్మ ఉత్సవాల నిర్వహించడం ఆనవాయితీ. అమావాస్య నుండి మొదలుకుని తొమ్మిది రోజులపాటు రోజుకో రీతిన బతుకమ్మ సంబరాలు జరుగుతాయి. బతుకమ్మ అంటేనే ఆడపడుచుల సంబరం. కానీ ఆ ఒక్క గ్రామంలో మాత్రం బతుకమ్మ పండుగ వేళ మహిళలు ఉత్సవాలకు దూరంగా ఉంటారు

ఇక్కడో వింత ఆచారం.. ఆడ-మగ కలిసి చేసే సంబరం.. ఎక్కడో తెలుసా?
Men Bathukamma
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Oct 21, 2025 | 8:38 AM

Share

తెలంగాణ రాష్ట్రంలో ఆశ్వయుజ మాసంలో బతుకమ్మ ఉత్సవాల నిర్వహించడం ఆనవాయితీ. అమావాస్య నుండి మొదలుకుని తొమ్మిది రోజులపాటు రోజుకో రీతిన బతుకమ్మ సంబరాలు జరుగుతాయి. బతుకమ్మ అంటేనే ఆడపడుచుల సంబరం. కానీ ఆ ఒక్క గ్రామంలో మాత్రం బతుకమ్మ పండుగ వేళ మహిళలు ఉత్సవాలకు దూరంగా ఉంటారు. దీపావళి సందర్భంగా బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించడం ఆ గ్రామంలో ఓ వింత ఆచారం.. ఆ ఒక్క కులస్తులు మాత్రమే దీపావళి సందర్భంగా మూడు రోజులపాటు బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తారు. మరో వింత ఏంటంటే ఆడవాళ్ళతో పాటు, పురుషులు కూడా బతుకమ్మలు ఆడతారు. మట్టితో ఎద్దు ప్రమిదలు చేసి ఊరంతా పండుగ నిర్వహించుకుంటారు. ఆ ఒక్క గ్రామంలో మాత్రమే దేశంలో ఎక్కడలేని వింత ఈ వింత ఆచారం ఎందుకు కొనసాగుతుంది..? ఇంతకీ ఆ కులస్తులు ఎవరు..?

ఈ వింత ఆచారం హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం సీతంపేటలో గ్రామంలో అనాదిగా కొనసాగుతుంది. నేతకాని కులస్తులు ప్రతి ఏటా దీపావళి సందర్భంగా బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీ..దీపావళి రోజు మొదలయ్యే బతుకమ్మ వేడుకలు మూడు రోజుల పాటు జరుగుతాయి. ఈ గ్రామంలో నేతకాని కులస్తులు అత్యధికంగా ఉంటారు. దీపావళి రోజే బతుకమ్మ వేడుకలు నిర్వహించడం ఆనవాయితీ. మూడు రోజుల ఉత్సవాలలో బాగంగా మొదటిరోజు కేదారీశ్వరి స్వామి వ్రతం, రెండోరోజు ఎద్దులకు ప్రతిమలతో పిండివంటలు సమర్పించి ఊరేగింపు నిర్వహిస్తారు. మూడవ రోజు పూలు పేర్చి బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తారు. బతుకమ్మ వేడుకలు ఆడ. మగ అంతా కలిసి పాల్గొనడం ఇక్కడ ప్రత్యేకత. ఈ వేడుకను చూసేందుకు పెద్ద ఎత్తున జనం తరలివస్తుంటారు. దీంతో సీతంపేట బతుకమ్మ ఉత్సవాలకు అధికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..