చలి ఎక్కువగా ఉందని మంచం కింద నెగడు పెట్టుకుంది.. పాపం తెల్లారేసరికి..
వరంగల్ జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. చలి తీవ్రత నుండి ఉపశమనం కోసం మంచం కింద నెగడు పెట్టుకున్న ఓ వృద్ధురాలు మరణించింది. ఆ నెగడులో చెలరేగిన మంటల్లో ఆమె సజీవ దహనం అయింది.. ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న వృద్ధురాలు తెల్లవారే సరికి కాలి బూడిదయింది..

వరంగల్ జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. చలి తీవ్రత నుండి ఉపశమనం కోసం మంచం కింద నెగడు పెట్టుకున్న ఓ వృద్ధురాలు మరణించింది. ఆ నెగడులో చెలరేగిన మంటల్లో ఆమె సజీవ దహనం అయింది.. ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న వృద్ధురాలు తెల్లవారే సరికి కాలి బూడిదయింది.. ఈ విషాద సంఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లు గ్రామంలో జరిగింది.. నరసమ్మ అనే 80 ఏళ్ల వృద్ధురాలు ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తుంది. చలి తీవ్రత విపరీతంగా ఉండడంతో వేడి కోసం మంచం కింద నెగడు పెట్టుకుంది. గ్రామాల్లో సహజంగా చాలామంది చలి తీవ్రత నుండి ఉపశమనం కోసం చలి మంటలు, ఇంట్లో నెగడు పెట్టుకుంటారు.
అయితే.. తాను నిద్రిస్తున్న క్రమంలో అర్ధరాత్రి ఆ నెగడులో మంటలు వ్యాపించాయి.. మంటలు నవారు మంచాన్ని అంటుకోవడంతో.. మంటలు వ్యాపించి నరసమ్మ సజీవ దహనమైంది.. మంటలు చెలరేగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో వృద్ధురాలు తెల్లవారేసరికి పూర్తిగా కాలిపోయి విగతజీవిగా కనిపించింది.
చలి మంటలు ఈ వృద్ధురాలి ప్రాణాలు బలి తీసుకోవడంతో ఊరంతా విషాద ఛాయలు అలముకున్నాయి.. కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
