AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ హీరో చాలా గొప్పవాడు.. అంత పెద్దవాడైనా చాలా ఒదిగి ఉంటాడు.. అజయ్ ఘోష్ మాటలకు ఫ్యాన్స్‌కు పూనకాలతో ఉగిపోవాల్సిందే

విలక్షణ నటనతో తనకంటూ మంచి క్రేజ్ తెచ్చుకున్నారు నటుడు అజయ్ ఘోష్. ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించారు అజయ్ ఘోష్.. కేవలం సహాయక పాత్రలే కాదు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లోనూ కనిపించి మెప్పించారు అజయ్ ఘోష్.

ఆ హీరో చాలా గొప్పవాడు.. అంత పెద్దవాడైనా చాలా ఒదిగి ఉంటాడు.. అజయ్ ఘోష్ మాటలకు ఫ్యాన్స్‌కు పూనకాలతో ఉగిపోవాల్సిందే
Ajay Ghosh
Rajeev Rayala
|

Updated on: Dec 25, 2025 | 3:15 PM

Share

టాలీవుడ్ లో ఎంతో మంది టాలెంటెడ్ యాక్టర్స్ ఉన్నారు. కేవలం హీరోలు, హీరోయిన్స్ మాత్రమే కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు కూడా తమ నటనతో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. ఇక ఎంతో మంది తమ నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తున్నారు. అలాంటి వారిలో అజయ్ ఘోష్ ఒకరు. విలక్షణ నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు అజయ్ ఘోష్. ముఖ్యంగా దర్శకుడు మారుతి దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో తన నటనతో ఆకట్టుకుంటున్నాడు అజయ్ ఘోష్. ఇదిలా ఉంటే అజయ్ ఘోష్ ఓ స్టార్ హీరో గురించి ఆసక్తి కామెంట్స్ చేశారు. అజయ్ ఘోష్ రంగస్థలం, పుష్ప సినిమాల్లో తన పాత్రలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించి అలరించారు.

ఇదిలా ఉంటే గతంలో అజయ్ ఘోష్ ఓ ఇంటర్వ్యూలో ఓ స్టార్ హీరో గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అజయ్ ఘోష్ రంగస్థలం చిత్రం షూటింగ్ సమయంలోని తన అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ, సెట్‌లో కారు దిగి, బట్టలు మార్చుకుని, మేకప్‌ వేసుకున్న తర్వాత తాము నటులం కాదని, క్యారెక్టర్లే అయ్యామని అన్నారు. రంగస్థలం సినిమాలో పాత్రల్లోకి వెళ్లిపోయేవాళ్ళం సోమరాజు, చిన్నబాబు, శేషు నాయుడు, చిట్టి బాబు, రామలక్ష్మి వంటి పాత్రలన్నీ సజీవంగా మారాయని ఆయన వివరించారు.

రంగస్థలం సినిమా సెట్ లో దాదాపు 200 నుంచి 300 మంది జనాలు, డ్రెస్సులతో ఊళ్లో ఉన్నట్టే అనిపించేదని ఘోష్ గుర్తుచేసుకున్నారు. సిటీ నుండి వచ్చి గ్రామీణ వాతావరణానికి అలవాటు పడటం ఎలా అనిపించిందనే ప్రశ్నకు, అది తనకు పెద్దగా తేడా అనిపించలేదని బదులిచ్చారు. రంగస్థలం టీమ్ అంతా ఒక కుటుంబంలా కలిసిమెలిసి పని చేసిందని, ఆ వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉండేదని అజయ్ ఘోష్ తెలియజేశారు. అలాగే రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ.. చరణ్ చాలా మంచి వ్యక్తి .. చిన్న పెద్ది అని తేడా లేదు అందరిని పలకరిస్తుంటారు. పెద్ద హీరో, చిరంజీవి కొడుకుని అని అలాంటివి ఏమి ఉండవు.. చాలా ఒదిగి ఉంటాడు. ఒక ఫైట్ సీన్ లో నా కాలుకు దెబ్బ తగిలింది.. చరణ్ వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి.. ఏమైంది అండి అంటూ అడిగి.. నా కాలుకు ప్యాడ్స్ పెట్టి వెంటనే అపోలోకి ఫోన్ చేసి నన్ను పంపించారు. మొత్తం స్కాన్ చేశారు. నెలన్నర బెడ్ రెస్ట్ ఇచ్చారు. అయినా నా గురించి రోజు అడిగి తెలుసుకునేవారు అని చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.