తెలుగు ఇండస్ట్రీలో లక్కీ ఛామ్.. ముద్దుగుమ్మ ఉంటే సినిమా హిట్టే
టాలీవుడ్‌లో మీనాక్షి చౌదరి 'లక్కీ ఛార్మ్', 'సైలెంట్ కిల్లర్'గా దూసుకుపోతోంది. మొదట్లో కొన్ని ఫ్లాపులు ఎదురైనా, 'హిట్ 2' తర్వాత ఆమె దశ మారింది. 'గుంటూరు కారం', 'లక్కీ భాస్కర్', 'అనగనగా ఒక రాజు' వంటి విజయాలతో వరుస అవకాశాలు దక్కించుకుంటూ టాప్ రేటింగ్ హీరోయిన్‌గా నిలిచింది. ప్రస్తుతం నాగ చైతన్యతో 'వృషకర్మ'లో నటిస్తూ తన సక్సెస్ జైత్రయాత్రను కొనసాగిస్తోంది.
సైలెంట్ కిల్లర్.. లక్కీ ఛామ్.. ఈ బిరుదులన్నీ ఇప్పుడు టాలీవుడ్‌లో ఓ హీరోయిన్‌కు బాగా సూట్ అవుతాయి. ఆ అమ్మాయి సినిమాలో ఉంటే బొమ్మ హిట్ అని నమ్మకానికి వచ్చేస్తున్నారు మేకర్స్. మధ్యలో ఒకట్రెండు ఫ్లాపైనా.. మ్యాగ్జిమమ్ సక్సెస్ రేట్‌తో లక్కీ బ్యూటీ అయిపోయింది ఆమె. మరి అంతగా మాయ చేస్తున్న ఆ హీరోయిన్ ఎవరు..? ఎలా మొదలుపెట్టాం అనేది కాదు.. ఎలా దూసుకుపోతున్నాం అనేది ఇంపార్టెంట్. మీనాక్షి చౌదరి కెరీర్ విషయంలో ఇది బాగా సెట్ అవుతుంది. మొదట్లో ఒకట్రెండు సినిమాలు ఫ్లాపైనా.. హిట్ 2 నుంచి అమ్మడి దశ మారింది. ఆ వెంటనే గుంటూరు కారంలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ కొట్టేసారు.. ఇక లక్కీ భాస్కర్‌తో లక్కీ హీరోయిన్ అయిపోయారు మీనాక్షి. మెకానిక్ రాఖీ, మట్కా లాంటి ఒకట్రెండు సినిమాలు మిస్ ఫైర్ అయినా.. గతేడాది సంక్రాంతికి వస్తున్నాంలో ప్రియురాలిగా మాయ చేసారు మీనాక్షి. అందులో ఆమె క్యారెక్టర్ బాగా పేలింది. ఇక ఈ పండక్కి అనగనగా ఒక రాజు అంటూ మరో బ్లాక్‌బస్టర్ అందుకున్నారు మీనాక్షి. నవీన్ పొలిశెట్టి నటించిన ఈ చిత్రంతో మీనాక్షి లక్కీ ఛామ్ అయిపోయారు. శ్రీలీల, భాగ్య శ్రీ బోర్సే లాంటి కాంపిటీటర్స్ ఫ్లాపుల్లో ఉన్న సమయంలో.. వరస విజయాలతో దూసుకుపోతున్నారు మీనాక్షి. ప్రస్తుతం నాగ చైతన్య స్పిరిచ్యువల్ థ్రిల్లర్ వృషకర్మలో నటిస్తున్నారు ఈ బ్యూటీ. కార్తిక్ దండు ఈ సినిమాకు దర్శకుడు. మొత్తానికి సైలెంట్ కిల్లర్ ఆఫ్ టాలీవుడ్‌గా మారిపోయింది మీనాక్షి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Vijay Deverakonda: వామ్మో! మరీ ఇలా ప్లాన్ చేసాక.. రౌడీ ఇంక దొరుకుతాడా..
Varanasi: వారణాసి విషయంలో రాజమౌళి సంచలన నిర్ణయం
Venkatesh: ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌పై వెంకటేష్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్
Top 9 ET: అన్న విజయానికి తమ్ముడి క్రేజీ రియాక్షన్ | బాస్ దెబ్బకు..కళ్ల ముందుకు గత వైభవం
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్‌కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని
డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్‌కి రాత్రి 11 గంటలకు ఫోన్.. కట్ చేస్తే
యజమాని మరణించడంతో శోకసంద్రంలో శునకం..
ఆంధ్రా భోజనం రుచికి.. జపాన్ అధికారులు ఫిదా

