Varanasi: వారణాసి విషయంలో రాజమౌళి సంచలన నిర్ణయం
రాజమౌళి తన కొత్త సినిమా 'వారణాసి'ని (SSMB29) 2027 ఏప్రిల్ 9న శ్రీరామనవమికి విడుదల చేయాలని కంకణం కట్టుకున్నారు. గత చిత్రాల వాయిదాల పరంపరకు స్వస్తి పలికి, ఈసారి అనుకున్న సమయానికి సినిమాను పూర్తి చేయాలని దృఢంగా ఉన్నారు. మహేష్ బాబు రాముడి పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ వేగంగా జరుగుతోంది. రెండేళ్లలో చిత్రాన్ని పూర్తి చేసి, పోస్ట్‌పోన్‌లు ఉండవని టీం స్పష్టం చేసింది.
రాజమౌళి సినిమా చెప్పిన టైమ్‌కు వస్తే కంగారు పడతారు కానీ వాయిదా పడుతుంటే అస్సలు టెన్షన్ పడరు అభిమానులు. పైగా.. అందులో వింతేముంది ఎప్పట్నుంచో జరుగుతుందేగా అంటారు. కానీ గతంగత:.. ఈసారి ఆన్ టైమ్ ఔట్ పుట్ ఉంటుందంటూ శపథాలు చేస్తున్నారు జక్కన్న. వారణాసి పోస్ట్‌పోన్ న్యూస్‌పై గట్టిగానే రియాక్ట్ అయ్యారు టీం. మరి వాళ్లేమంటున్నారు..? రాజమౌళి ఫోకస్ అంతా ఇప్పుడు వారణాసి సినిమాపైనే ఉంది. మహేష్ బాబు కూడా మధ్యలో వెకేషన్ కోసం చిన్నపాటి బ్రేకులు తీసుకుంటున్నా.. వేగంగానే వారణాసి షూట్ పూర్తి చేస్తున్నారు. గండిపేటలో ఈ చిత్ర షూటింగ్ రెండు వారాలుగా నాన్ స్టాప్‌గా జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో 2026 అక్టోబర్‌లోపే టాకీ పార్ట్ పూర్తి చేయాలని కంకణం కట్టుకున్నారు రాజమౌళి. చూస్తుంటే.. ఈసారి టార్గెట్ అనుకున్న టైమ్‌కు రీచ్ అయ్యేలాగే ఉన్నారు జక్కన్న అండ్ టీం. ముందు సినిమాల్లా కాకుండా.. ఏడాదిన్నర ముందే టీజర్ వచ్చింది.. మేకింగ్ వీడియో వచ్చింది.. ఇంటర్నేషనల్ ప్రమోషన్స్‌పై ఫోకస్ చేసారు.. షూటింగ్ కూడా రాకెట్ స్పీడ్‌లో నడుస్తుంది.. ఇవన్నీ అయినపుడు రిలీజ్ కూడా ఆన్‌టైమ్ ఉంటుందిగా మరి..! ఎప్రిల్ 9, 2027న శ్రీ రామనవమి సందర్భంగా సినిమా విడుదల కానుందని ప్రచారం జరుగుతుంది. పైగా సినిమాలో మహేష్ బాబు రాముడిగా నటిస్తున్నారు కాబట్టి అదే సరైన డేట్ అని ఫిక్సైపోయారంతా. ఈ డేట్ మైండ్‌లో పెట్టుకుని టీం కూడా పని చేస్తున్నారు. అయితే 2027 నుంచి వారణాసి వాయిదా పడిందనే వార్తలొస్తున్న వేళ.. అదేం లేదని కన్ఫర్మ్ చేసారు రాజమౌళి. ఈసారి పోస్ట్‌పోన్ ఉండదు.. కమింగ్ ఇన్ 2027 అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసారు వారణాసి టీం. దీన్నిబట్టి వాయిదాలు ఉండవని అర్థమవుతుంది. 2025 ఫిబ్రవరిలో ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకొచ్చారు జక్కన్న. ఎప్రిల్ 2027 రిలీజ్ అంటే.. ఈ లెక్కన రెండేళ్లలో వారణాసి పూర్తైనట్లే. షూటింగ్ ఏడాదిన్నర.. పోస్ట్ ప్రొడక్షన్ 4 నెలలు.. ప్రమోషన్ 2 నెలలు అన్నట్లు ప్లాన్ చేసుకున్నారు రాజమౌళి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Venkatesh: ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌పై వెంకటేష్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్
Top 9 ET: అన్న విజయానికి తమ్ముడి క్రేజీ రియాక్షన్ | బాస్ దెబ్బకు..కళ్ల ముందుకు గత వైభవం
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు.. చూడటానికి రెండు కళ్ళు చాలడం లేదు
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్‌కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని
డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్‌కి రాత్రి 11 గంటలకు ఫోన్.. కట్ చేస్తే
యజమాని మరణించడంతో శోకసంద్రంలో శునకం..
ఆంధ్రా భోజనం రుచికి.. జపాన్ అధికారులు ఫిదా

