AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్

టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్

N Narayana Rao
| Edited By: |

Updated on: Jan 23, 2026 | 5:06 PM

Share

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని కిష్టారం ప్రభుత్వ పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడు రియాజ్ విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. పాఠాలు బోధించడమే కాకుండా, పేద విద్యార్థుల చిరిగిన యూనిఫాంలను కుడుతూ, తెగిన గుండీలు వేస్తూ, గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందిస్తున్నారు. తల్లిదండ్రుల వలే వారిని అక్కున చేర్చుకొని, వారి మనసుల్లో చోటు సంపాదించుకున్నారు. ఆయన నిస్వార్థ సేవ ఎందరికో స్ఫూర్తిదాయకం.

స్టూడెంట్స్ కు పాఠాలు బోధించడమే కాదు…బడి కి వచ్చే పేద పిల్లలను ఒక పేరెంట్ లా దగ్గరకు తీసుకుంటూ చిరిగిన యూనిఫామ్ బట్టలను దర్జీ లాగా కుడుతూ స్టూడెంట్స్ మనసులను ఆకట్టుకుంటున్న ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం లోని ప్రభుత్వ హైస్కూల్ లో పేద స్టూడెంట్స్ ను పేరెంట్ లా అక్కున చేర్చుకుని వారి మనసులో చోటు సంపాదించుకున్నాడు రియాజ్ అనే హిందీ ఉపాధ్యాయుడు. దూర ప్రాంతాల నుంచి ఉదయాన్నే హడావిడిగా బడికి వచ్చే పేద విద్యార్ధులు చిరిగిపోయిన యూనిఫామ్ లతో వస్తుంటారు, మరికొందరు గుండీలు లేకుండా పిన్నిసులు పెట్టుకుని వస్తుంటారు. అలాంటి స్టూడెంట్స్ కు చిరిగిన యూనిఫామ్ ను సూది దారంతో నీట్ గా దర్జీ లా కుట్టి ఇస్తాడు, అలాగే గుండీలు తెగిపోయిన విద్యార్ధుల షర్టు లకు గుండీలు కుడతారు. స్కూల్ ఆవరణలో ఆటలు ఆడుతూ దెబ్బలు తగిలించుకున్న స్టూడెంట్స్ కూడా ఫస్ట్ ఎయిడ్ చేస్తారు. గాయాలను అయోడిన్ వేసి డ్రెస్సింగ్ చేసి కట్టు కడతారు. ఇలా పిల్లలకు ఉపాధ్యాయుడు గా పాఠాలు బోధించడమే కాకుండా వారి ఒక పేరెంట్ లా అక్కున చేర్చుకుని సేవలు చెయ్యడం స్టూడెంట్స్ ను ఆకర్షిస్తుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..

రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు.. చూడటానికి రెండు కళ్ళు చాలడం లేదు

పాపం గూగుల్‌ మ్యాప్‌కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని

డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్‌కి రాత్రి 11 గంటలకు ఫోన్‌.. సీన్ కట్ చేస్తే

Chili Price: ఘాటెక్కిన మిర్చి.. ధరలో పసిడితో పోటీ..