పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
సికింద్రాబాద్ తిరుమలగిరి ఆర్మీ పాఠశాల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీపై పాఠశాలకు వెళ్తున్న 6 ఏళ్ల బాలుడు ఆర్మీ వాహనం ఢీకొని దుర్మరణం చెందాడు. తల్లి తీవ్రంగా గాయపడింది. ఈ హృదయ విదారక ఘటన సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. నేరేడ్‌మెట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పాఠశాల సమీపంలో భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సికింద్రాబాద్‌లోని తిరుమలగిరి ఆర్మీ పాఠశాల సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్మీ పబ్లిక్ స్కూల్లో చదువుతున్న ఆరేళ్ల బాలుడు దుర్మరణం చెందాడు. ఈ హృదయవిదారక ఘటన స్థానికులను తీవ్రంగా కలిచివేసింది. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సమీపంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్కేపురం వంతెన నుంచి ఓ మహిళ తన ఏడేళ్ల కుమారుడిని స్కూటీపై పాఠశాలకు తీసుకెళ్తుండగా, తిరుమలగిరి ఆర్మీ స్కూల్ సమీపానికి చేరుకున్న సమయంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డుపై పడిపోయింది. అదే సమయంలో వెనక నుంచి వేగంగా వస్తున్న ఆర్మీ వాహనం క్షణాల వ్యవధిలోనే తల్లీకుమారులను ఢీకొని వారి పైనుంచి వెళ్లింది. ఈ ప్రమాదంలో బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తీవ్ర గాయాలపాలైన తల్లిని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నట్లు సమాచారం. కళ్లముందే కన్నబిడ్డ విగతజీవిగా మారడంతో ఆ తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. బాలుడి మృతితో ఆ ప్రాంతమంతా విషాదఛాయలు అలుముకున్నాయి. పాఠశాల సమీపంలో ఇలాంటి ప్రమాదం జరగడంపై తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న నేరేడ్‌మెట్ పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. బాలుడి తండ్రి జమ్మూకశ్మీర్‌లో సైన్యంలో సేవలు అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు.. చూడటానికి రెండు కళ్ళు చాలడం లేదు
పాపం గూగుల్ మ్యాప్‌కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని
డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్‌కి రాత్రి 11 గంటలకు ఫోన్.. సీన్ కట్ చేస్తే
Chili Price: ఘాటెక్కిన మిర్చి.. ధరలో పసిడితో పోటీ..
Sunita Williams: నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ కీలక నిర్ణయం
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్‌కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని
డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్‌కి రాత్రి 11 గంటలకు ఫోన్.. కట్ చేస్తే
యజమాని మరణించడంతో శోకసంద్రంలో శునకం..
ఆంధ్రా భోజనం రుచికి.. జపాన్ అధికారులు ఫిదా
డెలివరీ బాయ్‌గా మారిన ఎమ్మెల్యే.. 'ఏ పనీ తక్కువ కాదన్న నేత'

