AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chili Price: ఘాటెక్కిన మిర్చి.. ధరలో పసిడితో పోటీ..

Chili Price: ఘాటెక్కిన మిర్చి.. ధరలో పసిడితో పోటీ..

Phani CH
|

Updated on: Jan 23, 2026 | 1:10 PM

Share

వరంగల్‌లో మిర్చి ధరలు దూసుకుపోతున్నాయి, పసిడితో పోటీపడుతూ రైతుల మోముల్లో ఆనందం నింపుతున్నాయి. ముఖ్యంగా ఎల్లో మిర్చి ధర క్వింటాకు రూ.44,000 రికార్డు స్థాయిలో పలుకుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో దీనికి పెరిగిన డిమాండ్, చైనా, మలేషియా వంటి దేశాలకు ఎగుమతులు, రంగులు, ఔషధాల తయారీలో దీని ఉపయోగాలు ఈ ధరల పెరుగుదలకు కారణం. దిగుబడి తక్కువైనా, లాభాలు మాత్రం అధికం.

మిర్చి ధరలు బంగారంతో పోటీపడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో వరంగల్‌ మిర్చికి డిమాండ్‌ పెరిగింది. గత ఏడాది గిట్టుబాటు ధరలు లేక దిగాలుపడిన రైతులకు ఈసారి మిర్చి సిరులు కురపిస్తోంది. ధరలో పడిసితో పోటపడుతూ రికార్డులు సృష్టిస్తుండటంతో రైతులు ఆనందం వయక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎల్లో మిర్చి ధరలు పసిడితో పోటీ పడుతున్నాయి. అసలు పచ్చ మిర్చికి ఎందుకంత డిమాండ్.. ఆ మిర్చిని ఎక్కడికి ఎగుమతి చేస్తారో ఇప్పుడు చూద్దాం. వరంగల్ లోని ఎనుమామల వ్యవసాయ మార్కెట్ యార్డుకు మిర్చి అమ్మకానికి పోటెత్తింది. ఎర్ర బంగారం బస్తాల మధ్య అక్కడక్కడ పచ్చ మిర్చి ధగధగ మెరుస్తూ ఆకట్టుకుంటోంది. ధరకూడా బాగానే పలుకుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వరంగల్ ఎనుమాముల మార్కెట్ యార్డులో వండర్ హార్ట్ రకం మిర్చి క్వింటా రూ 26,200/-, తేజా క్వింటా రూ.22,000, దీపికా రకం మిర్చి క్వింటాకు రూ 26,200,… US 341రకం మిర్చి క్వింటాకు 25,500 రూపాయలు ధర పలుకుతుంది. ఇక ఎల్లో మిర్చి విషయానికి వస్తే..క్వింటా ఎల్లో మిర్చి రూ.44,000 రూపాయలు పలుకుతుంది. దీంతో రైతుల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఎల్లోమిర్చి ఇంత ధర పలకడం ఇదే మొదటిసారి. అంతర్జాతీయ మార్కెట్లో ఎల్లోమిర్చికి ఎక్కువగా డిమాండ్ ఉండడం వల్లే ఇలా ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు అంటున్నారు. ఈ మిర్చిని చైనా, మలేషియా, సింగపూర్, థాయిలాండ్ దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ఎల్లో రంగు మిర్చిని ఎక్కువగా పెప్పర్ ఐటమ్ గా ఉపయోగిస్తుంటారు.. కలర్స్ తయారీ, మెడిసిన్, కాస్మోటిక్ తయారి, చిప్స్ పైన పెప్పర్ గా ఉపయోగిస్తుంటారు. అయితే సాధారణ మిర్చితో పోల్చితే ఎల్లో మిర్చి పంట దిగుబడి కొంత తక్కువగా వస్తుంది కాబట్టి సాగు విస్తీర్ణం కూడా చాలా తక్కువగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదివేల ఎకరాల మేర ఈ మిర్చి సాగు జరుగుతుంది. ఈ ధరలు మరింత పెరగవచ్చని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఉన్నతశ్రేణి కార్యదర్శి మల్లేష్ అంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Sunita Williams: నాసా వ్యోమగామి సునీత విలియమ్స్‌ కీలక నిర్ణయం

SSC Exams 2026: ఏపీలో టెన్త్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

యజమాని మరణించడంతో శోకసంద్రంలో శునకం..

ఆంధ్రా భోజనం రుచికి.. జపాన్ అధికారులు ఫిదా

డెలివరీ బాయ్‌గా మారిన ఎమ్మెల్యే.. ‘ఏ పనీ తక్కువ కాదన్న నేత’