AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Driving License: ఈ ఐదు తప్పులు చేస్తే లైసెన్స్‌ కట్‌ !!

Driving License: ఈ ఐదు తప్పులు చేస్తే లైసెన్స్‌ కట్‌ !!

Phani CH
|

Updated on: Jan 24, 2026 | 9:35 AM

Share

2026 జనవరి 1 నుండి కొత్త ట్రాఫిక్ నియమాలు అమల్లోకి వచ్చాయి. ఒక ఏడాదిలో ఐదు లేదా అంతకంటే ఎక్కువ ఉల్లంఘనలకు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు అవుతుంది. అతివేగం, సీట్ బెల్ట్ లేకపోవడం వంటి 24 నిబంధనలను గుర్తించారు. RTO/DTOలకు లైసెన్స్ రద్దు అధికారం ఉంటుంది. టోల్ బకాయిలు ఉన్న వాహనాలకు NOC, ఫిట్‌నెస్ సర్టిఫికేట్ వంటి సేవలు నిలిపివేస్తారు. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి.

ఇకపై డ్రైవింగ్ చేసేటప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కేవలం జరిమానాతో సరిపెట్టకుండా.. నేరుగా డ్రైవింగ్ లైసెన్స్‌నే రద్దు చేస్తారు. 2026 జనవరి 1వ తేదీ నుంచి కొత్త ట్రాఫిక్‌ రూల్స్‌ అమల్లోకి వచ్చాయి. కొత్త సవరణల ప్రకారం.. ఒక ఏడాదిలో ఎవరైనా వాహనదారులు ఐదు లేదా అంతకంటే ఎక్కువ సార్లు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే వారి లైసెన్స్ సస్పెండ్ అవుతుంది. ముఖ్యంగా అతివేగం, హెల్మెట్ లేదా సీట్ బెల్ట్ లేకపోవడం, సిగ్నల్ జంపింగ్, అక్రమ పార్కింగ్, ఓవర్‌ లోడింగ్, తోటి ప్రయాణికులతో అసభ్య ప్రవర్తన వంటి 24 రకాల ఉల్లంఘనలను గుర్తించారు. వీటిలో ఏవైనా ఐదు తప్పులు చేస్తే లైసెన్స్ రద్దుకు సిఫార్సు చేస్తారు. అయితే లైసెన్స్ రద్దు చేసే అధికారం ప్రాంతీయ రవాణా కార్యాలయం RTO లేదా జిల్లా రవాణా కార్యాలయానికి DTO ఉండగా.. లైసెన్స్ రద్దు చేసే ముందు వాహనదారుడికి వివరణ ఇచ్చుకునే అవకాశాన్ని కల్పిస్తారు. కేవలం ట్రాఫిక్ నిబంధనలే కాకుండా.. టోల్ ఫీజు చెల్లింపుల విషయంలోనూ ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసింది. ‘సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్, 2026’ ప్రకారం.. వాహనానికి టోల్ బకాయిలు ఉంటే కీలక సేవలను నిలిపి వేస్తారు. ముఖ్యంగా టోల్ బకాయిలు క్లియర్ చేసే వరకు వాహనానికి ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు అవసరమైన NOC ఇవ్వరు. అలాగే వెహికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్ రెన్యూవల్ కాదు. కమర్షియల్ వాహనాలకు నేషనల్ పర్మిట్ కూడా నిరాకరిస్తారు. టోల్ ప్లాజా దాటినప్పుడు సాంకేతిక కారణాల వల్ల ఎలక్ట్రానిక్ సిస్టమ్‌లో పేమెంట్ కాకపోయినా.. దానిని కూడా బకాయిగానే పరిగణిస్తారు. కాబట్టి వాహనదారులందరూ జాగ్రత్తగా ఉండాలని, వాహనాలు నడిపేటప్పుడు అన్ని నిబంధనలూ పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆకాశం నుంచి అరసవల్లి దర్శనం..హెలికాప్టర్, బెలూన్ రైడ్స్ – టికెట్ ధరలు ఇవే

Jr NTR: ఎన్టీఆర్ కి అనారోగ్యం.. డ్రాగన్ మూవీ షూటింగ్‌కి బ్రేక్‌

Dhurandhar 2: ఆడియన్స్ గెట్ రెడీ.. దురంధర్ 2 టీజర్ వచ్చేస్తోంది

మేడారంలో.. కుక్కెత్తు బంగారం… హీరోయిన్ తీరుపై తీవ్ర విమర్శలు

Amitabh Bachchan: అమితాబ్ ఇంట్లో గోల్డెన్ టాయిలెట్… సెల్ఫీ దిగి వైరల్ చేసిన హీరో