Gold Price: గోల్డ్.. సామాన్యులకు ఇక అందని ద్రాక్షేనా..!
బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. జనవరి 23న 24 క్యారెట్ల బంగారం ₹1,59,710, కిలో వెండి ₹3,60,000 వద్ద రికార్డు స్థాయికి చేరాయి. అంతర్జాతీయ ఉద్రిక్తతలు, డాలర్ బలహీనపడటంతో సురక్షిత పెట్టుబడికి డిమాండ్ పెరిగి ధరలు భారీగా పెరిగాయి. సామాన్యులకు ఇది అందని ద్రాక్షేనా అనే ప్రశ్న తలెత్తుతోంది. కొనుగోలు చేసే ముందు నగరాల వారీగా ధరలు పరిశీలించండి.
బంగారం, వెండి ధరలు మళ్లీ ఆకాశాన్నంటుతున్నాయి. సామాన్యులకు ఇక బంగారం అందని ద్రాక్షేనా అనేలా ఊహించని విధంగా దూసుకుపోతున్నాయి. గురువారం భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు శుక్రవారం ఊహించని విధంగా దూసుకుపోతున్నాయి. జనవరి 23 శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.5,400లు పెరిగి రూ 1,59,710 వద్ద ఆల్ టైమ్ హై రికార్డును తాకింది. 22 క్యారెట్ల బంగారంపై రూ.4,950లు పెరిగి లక్షా యాభైవేలకు చేరువలో ఉంది. ఇక వెండి నన్ను పట్టుకోవడం మీ తరం కాదు అన్నట్టుగా ఒక్కరోజే ఏకంగా రూ.20,000లు పెరిగి కిలో వెండి రూ.3,60,000లకు చేరింది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు అలాగే డాలర్ బలహీనపడటంతో సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం పై ఒక్కసారిగా ఒత్తిడి పెరిగింది. ఫలితంగా దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్‌లో మునుపెన్నడూ లేని విధంగా ధరలు పెరిగాయి. ఇక దేశీయంగా వివిధ నగరాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,59,860 , పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,46,550 పలుకుతోంది. ముంబై లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,59,710 ఉంటే, 22 క్యారెట్ల బంగారం రూ.1,46,400 పలుకుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,59,820లు పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,46,500 గా ఉంది. కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం రూ. 1,59,710 ఉంటే, 22 క్యారెట్ల బంగారం రూ.1,46,400గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,59,710 ఉంటే.. 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,46,400 పలుకుతోంది. కిలో వెండి ధర రూ.3,60,000 పలుకుతోంది. ఈ ధరలు పెరగవచ్చు, తగ్గవచ్చు. బంగారం కొనడానికి వెళ్లేముందు మరోసారి ధరలు చెక్‌చేసుకుంటే మంచిది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బరువు తగ్గాలని ఆ పౌడర్ తిని.. అంతలోనే అనంతలోకాలకు
దుర్గమ్మ ఆలయం నుంచి ఫోన్ కాల్..నమ్మారో..అంతే సంగతులు
పండుగ కోసం ఊరెళ్లిన కుటుంబం.. తిరిగి వచ్చేసరికి ఇంట్లో..
బరువు తగ్గాలని ఆ పౌడర్ తిని.. అంతలోనే అనంతలోకాలకు
పండుగ కోసం ఊరెళ్లిన కుటుంబం.. తిరిగి వచ్చేసరికి ఇంట్లో..
ఎడారి నేలలో యాపిల్స్, దానిమ్మను పండించిన మహిళా రైతు
ప్రియుడితో కలిసి భర్త మర్డర్.. ఇక తెల్లార్లు అదే పని
విశాఖ సముద్రంలో షాకింగ్ దృశ్యం
మంటల్లో గడ్డివాము.. పడగవిప్పి బుసలు కొట్టిన నాగుపాము
ప్రపంచ అతిపెద్ద గనులు మూసివేత ?? కారణం..

