AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎడారి నేలలో యాపిల్స్, దానిమ్మను పండించిన మహిళా రైతు

ఎడారి నేలలో యాపిల్స్, దానిమ్మను పండించిన మహిళా రైతు

Phani CH
|

Updated on: Jan 24, 2026 | 1:27 PM

Share

రాజస్థాన్‌లోని సికర్ జిల్లాలో సంతోష్ దేవి బీడు భూముల్లో పదేళ్ల కఠోర శ్రమతో సేంద్రియ పద్ధతుల్లో దానిమ్మ, యాపిల్ పండించి అద్భుతం చేశారు. ఎడారి భూమిని సారవంతం చేసి, వ్యవసాయం లాభదాయకమని నిరూపించారు. రూ.3,000 నెలవారీ ఆదాయం నుండి రూ.40,000 సంపాదిస్తున్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రత్యేక ఆహ్వానితురాలిగా ఎంపికైన ఆమె, ఎందరో మహిళలకు స్ఫూర్తినిచ్చారు.

సాగుకు ఏమాత్రం అనుకూలం కాని బీడు భూముల్లో దానిమ్మ, యాపిల్ పండ్లను పండించింది ఓ మహిళా రైతు. బీడు భూమిలో ఒకటికాదు రెండు కాదు హార్టికల్చర్ సాగుకు పదేళ్లు కష్టపడింది. వ్యవసాయ పద్ధతుల్ని పలు మార్లు ప్రయోగాత్మకంగా మారుస్తూ తన లక్ష్యం కొనసాగించింది. ఆఖరికి ఆమె ప్రయత్నం ఫలించి బీడు భూమి కాస్తా సారవంతంగా మారింది. రాజస్తాన్‌ ఎడారి ప్రాంతం సికర్ జిల్లా బేరీ గ్రామంలో సంతోష్‌దేవి బీడు భూముల్లో సేంద్రీయపద్ధతుల్లో దానిమ్మ, యాపిల్ పండ్లను పండించింది. సంతోష్ దేవి ప్రస్తుతం ఢిల్లీలో జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రత్యేక ఆహ్వానితురాలిగా ఎంపికైంది. పోస్టులో వచ్చిన ఆ ప్రత్యేక ఆహ్వానం గురించి తెలియగానే ఆమె కుటుంబ సభ్యులు, గ్రామస్థుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తన 17 ఏళ్ల కఠోర శ్రమ, పోరాటానికి దక్కిన ఫలితమే ఈ గౌరవమని సంతోష్ దేవి ఆనందం వ్యక్తం చేసింది. మూడు రోజుల క్రితం రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వానం అందిందని, అప్పటి నుంచి ఎంతో ఉత్సాహంగా ఉన్నానని తెలిపింది. రసాయనాలు లేని సేంద్రియ పద్ధతిలో దానిమ్మ, యాపిల్, జామ పండ్లను సంతోష్ దేవి సాగు చేస్తోంది. ఆమె పొలంలో పండిన దానిమ్మ పండ్లు 800 గ్రాముల వరకు, యాపిల్స్ 200 గ్రాముల వరకు బరువు తూగుతున్నాయి. వ్యవసాయం లాభదాయకం కాదనే వాదనను తాను తప్పని నిరూపించానని, ఒకప్పుడు తన భర్త ఆదాయం రూ.3,000 కాగా, ఇప్పుడు తాను వ్యవసాయం ద్వారా నెలకు రూ.40,000 సంపాదిస్తున్నట్లు వివరించింది. సంతోష్ దేవి స్ఫూర్తితో హార్టికల్చర్ ద్వారా ప్రస్తుతం వేలాది మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. అంతేకాకుండా, ఆమె ఏటా 80,000 మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణలోనూ కీలక పాత్ర పోషిస్తోంది. 2016-17లో నాటి ముఖ్యమంత్రి వసుంధర రాజే నుంచి లక్ష రూపాయల అవార్డు అందుకున్న తర్వాత తాను వెనుదిరిగి చూడలేదని ఆమె గుర్తుచేసుకుంది. ఈ విజయం మహిళా సాధికారతకు, రైతులకు దక్కిన గౌరవానికి చిహ్నంగా స్థానికులు భావిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రియుడితో కలిసి భర్త మర్డర్.. ఇక తెల్లార్లు అదే పని

మేడారం జాతర ఏరియల్ వ్యూ కోసం హెలికాప్టర్ రైడ్స్.. డిస్కౌంట్ కూడా..

ప్రపంచ అతిపెద్ద గనులు మూసివేత ?? కారణం..

Driving License: ఈ ఐదు తప్పులు చేస్తే లైసెన్స్‌ కట్‌ !!

మంటల్లో గడ్డివాము.. పడగవిప్పి బుసలు కొట్టిన నాగుపాము