మంటల్లో గడ్డివాము.. పడగవిప్పి బుసలు కొట్టిన నాగుపాము
ఖమ్మం జిల్లా, పేరువంచ గ్రామంలో ఆశ్చర్యకర ఘటన జరిగింది. గడ్డివాము అగ్నిప్రమాదంలో చిక్కుకున్న నాగు పాము ఒక్కసారిగా బయటకు వచ్చి పడగ విప్పి, మంటల్ని కోపంగా చూస్తూ గంటపాటు నిలబడింది. ఈ దృశ్యం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి, పాము అక్కడే నివసిస్తుందా లేదా మరో పాము చిక్కుకుపోయిందా అనే చర్చకు దారితీశాయి.
ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువంచ గ్రామంలో ఆశ్చర్యకర ఘటన జరిగింది. ప్రమాదవశాత్తు గడ్డివాముకు మంటలు అంటుకొని తగలబడిపోతోంది. గమనించిన స్థానికులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నాలు చేశారు. అయితే ఈ సమయంలో అక్కడ కనిపించిన ఒక దృశ్యం అందరినీ షాక్‌కు గురిచేసింది. గడ్డివాము మంటల్లో కాలిపోతుండగా, అందులో ఉన్న నాగు పాము ఒక్కసారిగా బయటకు వచ్చి పడగ విప్పింది. మంటల వేడికి తట్టుకోలేక బయటకు వచ్చిన ఆ పాము, మంటల వైపే చూస్తూ బుసలు కొడుతూ సుమారు గంటసేపు అక్కడే నిలబడి ఉంది. ఎదురుగా కాలిపోతున్న గడ్డివామును కోపంగా చూస్తూ పెద్ద పెద్దగా బుసలు కొడుతున్న నాగుపామును చూసి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆ గడ్డివామును ఆవాసంగా చేసుకుని పాము అక్కడే నివసిస్తుందా? లేక మంటల్లో దాని తోటి పాము చిక్కుకుపోయిందా? అనే అనుమానం వ్యక్తం చేశారు స్థానికులు. గడ్డి వాము దగ్ధమవుతున్న సమయంలో నాగు పాము పడగ విప్పి మంటల్ని చూస్తూ నిలిచిన ఆ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆకాశం నుంచి అరసవల్లి దర్శనం..హెలికాప్టర్, బెలూన్ రైడ్స్ – టికెట్ ధరలు ఇవే
Jr NTR: ఎన్టీఆర్ కి అనారోగ్యం.. డ్రాగన్ మూవీ షూటింగ్‌కి బ్రేక్
Dhurandhar 2: ఆడియన్స్ గెట్ రెడీ.. దురంధర్ 2 టీజర్ వచ్చేస్తోంది
మేడారంలో.. కుక్కెత్తు బంగారం… హీరోయిన్ తీరుపై తీవ్ర విమర్శలు
Amitabh Bachchan: అమితాబ్ ఇంట్లో గోల్డెన్ టాయిలెట్… సెల్ఫీ దిగి వైరల్ చేసిన హీరో
విశాఖ సముద్రంలో షాకింగ్ దృశ్యం
మంటల్లో గడ్డివాము.. పడగవిప్పి బుసలు కొట్టిన నాగుపాము
ప్రపంచ అతిపెద్ద గనులు మూసివేత ?? కారణం..
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని

