Gold Price Today: భగ్గుమంటున్న బంగారం.. ఇవాళ ధర ఎంతంటే
దేశంలో బంగారం ధరలు మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయికి చేరాయి. అంతర్జాతీయ ఉద్రిక్తతలు, డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలే దీనికి ప్రధాన కారణం. జనవరి 24న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,470 పెరిగి రూ.1,58,620కి, 22 క్యారెట్ల బంగారం రూ.1,350 పెరిగి రూ.1,45,400కి చేరింది. వెండి ధర కూడా స్వల్పంగా పెరిగింది. వివిధ నగరాల్లో ప్రస్తుత ధరల వివరాలు ఈ వార్తలో.
దేశంలో బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయి. అంతర్జాతీయంగా పరిస్థితులు ఉద్రిక్త కరంగా మారే సూచనలతో పసిడి ధరలు నింగిని తాకుతున్నాయి. ఈ వారంలోనే బంగారం ధరలు భారీగా పెరిగాయి. దేశంలో మునుపెన్నడూ లేని విధంగా గరిష్ఠ స్థాయికి ధరలు చేరుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలే ఇందుకు ప్రధాన కారణం అని చెప్పవచ్చు. జనవరి 24 శనివారం కూడా ఈ బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1,470 పెరిగి రూ.1,58,620 లకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1,350 పెరిగి రూ.1,45,400కు చేరింది. ఇక వెండి ధర మాత్రం స్వల్పంగా పెరిగింది. కేజీ వెండిపై రూ.100 పెరిగి రూ.3,60,100లు పలుకుతోంది. శనివారం దేశంలోని వివిధ నగరాల్లో బంగారం,వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. దేశరాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,58,770, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,45,550 పలుకుతోంది. ముంబై లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,58,620 ఉంటే, 22 క్యారెట్ల బంగారం రూ.1,45,400 పలుకుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,59,490లు, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,46,200 గా ఉంది. కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం రూ.1,58,620 ఉంటే, 22 క్యారెట్ల బంగారం రూ.1,45,400 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,58,620 ఉంటే.. 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,45,400 పలుకుతోంది. కిలో వెండి ధర రూ.3,60,100 పలుకుతోంది. ఈ ధరలు పెరగవచ్చు, తగ్గవచ్చు. బంగారం కొనడానికి వెళ్లేముందు మరోసారి ధరలు చెక్‌చేసుకుంటే మంచిది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రథసప్తమి వేళ అరసవిల్లిలో అర్ధరాత్రి నుంచే పూజలు ప్రారంభం
TOP 9 ET: చిక్కుల్లో చిరు నెక్స్ట్ మూవీ ?? | బుక్ మై షోలో.. బాస్ దిమ్మతిరిగే రికార్డ్
The Raja Saab: రాజాసాబ్‌కు రూ.100 కోట్ల నష్టం ??
షాకింగ్ న్యూస్.. అరికాళ్ళపై షుగర్ దాడి
రూ. 78 లక్షల హాస్పిటల్ బిల్లును.. రూ.21 లక్షలకు తగ్గించిన AI
రూ. 78 లక్షల హాస్పిటల్ బిల్లును.. రూ.21 లక్షలకు తగ్గించిన AI
'మద' ఏనుగు బీభత్సం.. దాడుల్లో 22 మంది హతం
బరువు తగ్గాలని ఆ పౌడర్ తిని.. అంతలోనే అనంతలోకాలకు
పండుగ కోసం ఊరెళ్లిన కుటుంబం.. తిరిగి వచ్చేసరికి ఇంట్లో..
ఎడారి నేలలో యాపిల్స్, దానిమ్మను పండించిన మహిళా రైతు
ప్రియుడితో కలిసి భర్త మర్డర్.. ఇక తెల్లార్లు అదే పని
విశాఖ సముద్రంలో షాకింగ్ దృశ్యం

