AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రథసప్తమి వేళ అరసవిల్లిలో అర్ధరాత్రి నుంచే పూజలు ప్రారంభం

రథసప్తమి వేళ అరసవిల్లిలో అర్ధరాత్రి నుంచే పూజలు ప్రారంభం

Phani CH
|

Updated on: Jan 24, 2026 | 8:51 PM

Share

శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలకు సర్వం సిద్ధమైంది. ఈసారి ఆదివారం, రథసప్తమి కలిసి రావడంతో భానుసప్తమిగా ప్రత్యేకత సంతరించుకుంది. రెండు లక్షల మంది భక్తులు వస్తారని అంచనా. శనివారం అర్ధరాత్రి నుంచే దర్శనం, క్షీరాభిషేకం ప్రారంభం. భద్రతకు 2500 మంది పోలీసులు, ట్రాఫిక్ ఆంక్షలు, ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు.

రథసప్తమి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలోని శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం, రథసప్తమి కలిసి రావడంతో ఈ రథసప్తమి ప్రత్యేకత సంతరించుకుంది. ఆదివారం వచ్చే సప్తమిని భానుసప్తమి అనికూడా పిలుస్తారు. రథసప్తమి, భానుసప్తమి సూర్యభగవానుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. ఈక్రమంలో అరసవిల్లి సూర్యనారాయణస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తనున్నారు. దీంతో శనివారం అర్ధరాత్రి ఒంటి గంట నుంచే స్వామివారి నిజరూప దర్శనం, క్షీరాభిషేక కార్యక్రమాలు ప్రారంభించనున్నారు అర్చకులు. ఇక రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ వేడుకలకు సుమారు రెండు లక్షల మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శనాలకు ఆరు క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. సామాన్య భక్తులు అరగంటలో దర్శనం చేసుకునేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. భక్తుల భద్రత దృష్ట్యా ఆరుగురు అడిషనల్ ఎస్పీల పర్యవేక్షణలో 2500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా నగరంలో ప్రత్యేక ఆంక్షలు అమలు చేస్తున్నారు. భక్తుల రాకపోకల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET: చిక్కుల్లో చిరు నెక్స్ట్‌ మూవీ ?? | బుక్ మై షోలో.. బాస్ దిమ్మతిరిగే రికార్డ్

The Raja Saab: రాజాసాబ్‌కు రూ.100 కోట్ల నష్టం ??

షాకింగ్‌ న్యూస్‌.. అరికాళ్ళపై షుగర్ దాడి

రూ. 78 లక్షల హాస్పిటల్‌ బిల్లును.. రూ.21 లక్షలకు తగ్గించిన AI

గ్రీన్‌ల్యాండ్ మంచు కింద అమెరికా అణు రియాక్టర్‌