గ్రీన్‌ల్యాండ్ మంచు కింద అమెరికా అణు రియాక్టర్
గ్రీన్‌ల్యాండ్‌లో ప్రచ్ఛన్న యుద్ధకాల నాటి అమెరికా రహస్య సైనిక స్థావరం 'క్యాంప్ సెంచరీ'ని నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. 'ప్రాజెక్ట్ ఐస్‌వర్మ్'లో భాగంగా అణు క్షిపణుల నిల్వ కోసం దీన్ని నిర్మించారు. 1967లో వదిలేసిన ఈ స్థావరం మంచు కింద కూరుకుపోయింది. మంచు కరుగుతుండటంతో అణు వ్యర్థాలు బయటపడి పర్యావరణానికి ముప్పుగా మారవచ్చని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు.
ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో అమెరికా అత్యంత రహస్యంగా నిర్మించిన సైనిక స్థావరం ఒకటి ప్రస్తుతం బయటపడింది. గ్రీన్‌ల్యాండ్ మంచు పొరల కింద కూరుకుపోయిన ‘క్యాంప్ సెంచరీ’ అనే ఈ బేస్‌ను నాసా శాస్త్రవేత్తలు రాడార్ స్కానింగ్‌లో గుర్తించారు. సోవియట్ యూనియన్ అమెరికా మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగింది. 1991లో ఆ యుద్ధం ముగిసింది. నాసా శాస్త్రవేత్తలు విమానంలో ఉత్తర గ్రీన్‌ల్యాండ్‌పై ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఓ రాడార్ వ్యవస్థను పరీక్షిస్తున్నప్పుడు, పిటుఫిక్ స్పేస్ బేస్‌కు సుమారు 200 కిలోమీటర్ల దూరంలో మంచు కింద కొన్ని నిర్మాణాలను రాడార్ సిగ్నల్స్ పసిగట్టాయి. చారిత్రక మ్యాపులతో సరిపోల్చి అది రహస్య అణుస్థావరం క్యాంప్ సెంచరీ అని నిర్ధారించుకున్నారు. 1959లో అమెరికా ఇంజినీర్లు ఈ బేస్‌ను నిర్మించారు. ‘మంచు కింద నగరం’గా ఈ స్థావరాన్ని అప్పట్లో పిలిచేవారు. అప్పట్లోనే అక్కడ 8 మీటర్ల లోతున సొరంగాలు తవ్వి, పైన మంచుతో కప్పేశారు. సుమారు 200 మంది సిబ్బంది నివసించేలా ల్యాబొరేటరీలు, నివాస గృహాలు నిర్మించారు. దీనికి పోర్టబుల్ న్యూక్లియర్ జనరేటర్‌తో విద్యుత్‌ను అందించేవారు. వాస్తవానికి ఇది ‘ప్రాజెక్ట్ ఐస్‌వర్మ్’ అనే రహస్య ప్రణాళికలో భాగం. సోవియట్ యూనియన్‌ను లక్ష్యంగా చేసుకుని అణు క్షిపణులను అక్కడ దాచి ఉంచాలన్నది అమెరికా వ్యూహం. అయితే, మంచు కదలికలు ఊహించిన దానికంటే వేగంగా ఉండటంతో ఆ ప్రాజెక్టు సురక్షితం కాదని భావించి, 1967 నాటికి దీన్ని పూర్తిగా వదిలేశారు. కాలక్రమేణా మంచు పేరుకుపోవడంతో, ప్రస్తుతం ఈ స్థావరం అవశేషాలు సుమారు వందఅడుగుల లోతులో కూరుకుపోయి ఉన్నాయి. అణు రియాక్టర్‌ను తొలగించినప్పటికీ, రసాయనిక, జీవ, రేడియోధార్మిక వ్యర్థాలు అక్కడే మిగిలిపోయాయి. వాతావరణ మార్పులతో మంచు కరుగుతున్న నేపథ్యంలో, భవిష్యత్తులో ఈ వ్యర్థాలు బయటపడి పర్యావరణానికి ముప్పుగా మారవచ్చని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సీక్వెల్స్ వస్తున్నాయి.. ఇప్పుడు కాదు.. మరి ఇంకెప్పుడు
Dhurandhar: ఇండియన్ సినిమాలో ధురంధర్ సంచలనాలు.. బాలీవుడ్‌లో రికార్డుల సునామీ
Sharwanand: శర్వానంద్ గ్రాండ్ రీఎంట్రీ.. ఒక్క హిట్టుతో జోరు మాములుగా లేదుగా
ముద్దుగుమ్మల ఆశలు అడియాశలు.. సంక్రాంతికి అనుకోని షాక్
Trivikram: త్రివిక్రమ్ ‘అ’ అక్షరం టైటిల్ సెంటిమెంట్.. ఈ సారి హిట్టు పక్క
'మద' ఏనుగు బీభత్సం.. దాడుల్లో 22 మంది హతం
బరువు తగ్గాలని ఆ పౌడర్ తిని.. అంతలోనే అనంతలోకాలకు
పండుగ కోసం ఊరెళ్లిన కుటుంబం.. తిరిగి వచ్చేసరికి ఇంట్లో..
ఎడారి నేలలో యాపిల్స్, దానిమ్మను పండించిన మహిళా రైతు
ప్రియుడితో కలిసి భర్త మర్డర్.. ఇక తెల్లార్లు అదే పని
విశాఖ సముద్రంలో షాకింగ్ దృశ్యం
మంటల్లో గడ్డివాము.. పడగవిప్పి బుసలు కొట్టిన నాగుపాము

