800 మంది ఉరిశిక్షలను నేనే ఆపాను.. లేకపోతే..
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్‌పై సైనిక చర్యకు సిద్ధమైన అమెరికా చివరి నిమిషంలో నిర్ణయాన్ని రద్దు చేసుకున్నా, ట్రంప్ హెచ్చరికలు, సైనిక సన్నాహాలు తగ్గలేదు. 837 మంది నిరసనకారుల ఉరిశిక్షలు తన బెదిరింపులతోనే ఆగిపోయాయని ట్రంప్ ప్రకటించారు. చర్చలకు సిద్ధమని చెప్పినా, భారీ నౌకాదళం మోహరించడంతో గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఇరాన్‌పై సైనిక చర్య కు సిద్ధమైన అమెరికా.. చివరి నిమిషంలో తన నిర్ణయాన్ని రద్దు చేసుకుంది. అయితే తాజాగా ట్రంప్ మళ్లీ మాట మార్చారు. అయితే ఇరాన్‌లో ఉద్రిక్తతలు తగ్గలేదనీ సైనిక సన్నాహాలు కొనసాగుతాయని అన్నారు. తన బెదిరింపులతోనే ఇరాన్ 837 మంది నిరసనకారుల ఉరిశిక్షలను ఆపివేసిందని. ఇరాన్‌తో మాట్లాడటానికి తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఇరాన్ పాలకులకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి హెచ్చరికలు చేశారు. ఇప్పటికే ఇరాన్ చుట్టూ భారీ నౌకాదళాన్ని మోహరించామని.. అమెరికాలోని అతిపెద్ద సైన్యం ఆ దేశం వైపు కదులుతోందని అన్నారు. అక్కడి పరిస్థితులను తాము నిశితంగా పరిశీలిస్తున్నామని, ఇక ముందు ఏం జరుగుతుందో వేచి చూస్తామన్నారు.తను కల్పించుకోకపోయి ఉంటే ఇరాన్‌లో 800 మందికి పైగా నిరసనకారులు తమ ప్రాణాలు కోల్పోయేవారని.. వారి ఉరిశిక్షలను తాను ఆపానని తెలిపారు. వారిని ఉరితీస్తే ఇరాన్‌పై తీవ్ర చర్యలు తీసుకుంటానని హెచ్చరించడంతో ఇరాన్ వెనక్కి తగ్గిందన్నారు. ఇరాన్‌తో ఉద్రిక్తతలు పెరుగుతోన్న నేపథ్యంలో గత వారం ఆసియా-పసిఫిక్ ప్రాంతం నుంచి యుద్ధనౌకలు ముందుకు కదిలాయి. ఇరాన్ లో నిరసనలు ఆందోళనలతో వాతావరణం వేడెక్కింది. భద్రతా దళాలకు స్థానిక ప్రజలకు మధ్య పోరులో వేలాది మంది మృతి చెందారు. గల్ఫ్ దేశాల జోక్యంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. నిరసనలలో 3 వేల మంది మరణించారని ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. అయితే, మానవ హక్కుల సంఘాల ప్రకారం.. ఈ సంఖ్య చాలా ఎక్కువని అంచనా వేసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Gold Price Today: భగ్గుమంటున్న బంగారం.. ఇవాళ ధర ఎంతంటే
రథసప్తమి వేళ అరసవిల్లిలో అర్ధరాత్రి నుంచే పూజలు ప్రారంభం
TOP 9 ET: చిక్కుల్లో చిరు నెక్స్ట్ మూవీ ?? | బుక్ మై షోలో.. బాస్ దిమ్మతిరిగే రికార్డ్
పోలీస్ స్టేషన్‌కు చేరిన చిలక పంచాయితీ
రూ. 78 లక్షల హాస్పిటల్ బిల్లును.. రూ.21 లక్షలకు తగ్గించిన AI
'మద' ఏనుగు బీభత్సం.. దాడుల్లో 22 మంది హతం
బరువు తగ్గాలని ఆ పౌడర్ తిని.. అంతలోనే అనంతలోకాలకు
పండుగ కోసం ఊరెళ్లిన కుటుంబం.. తిరిగి వచ్చేసరికి ఇంట్లో..
ఎడారి నేలలో యాపిల్స్, దానిమ్మను పండించిన మహిళా రైతు
ప్రియుడితో కలిసి భర్త మర్డర్.. ఇక తెల్లార్లు అదే పని

