AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షాకింగ్‌ న్యూస్‌.. అరికాళ్ళపై షుగర్ దాడి

షాకింగ్‌ న్యూస్‌.. అరికాళ్ళపై షుగర్ దాడి

Phani CH
|

Updated on: Jan 24, 2026 | 7:38 PM

Share

డయాబెటిక్ న్యూరోపతి షుగర్ వ్యాధిగ్రస్తులకు పెను ప్రమాదం. అరికాళ్లలోని నాడులు దెబ్బతిని స్పర్శ కోల్పోతారు, చిన్న గాయం కూడా కాలు కోల్పోయే పరిస్థితికి దారితీయవచ్చు. ఉస్మానియా ఆసుపత్రిలోని 'డయాబెటిక్ ఫుట్ కేర్ క్లినిక్' ఈ సమస్యలకు ఉచిత చికిత్స అందిస్తుంది. పాదాల సంరక్షణ, నివారణ పద్ధతులు పాటిస్తే ఈ ముప్పును తప్పించుకోవచ్చు.

షుగర్‌ వ్యాధిగ్రస్తులకు షాకింగ్‌ న్యూస్‌. చాలామందికి తెలియకుండానే పెను ప్రమాదంలో పడుతున్నారు. నొప్పి ఉండదు, మంట ఉండదు.. కానీ అరికాళ్లలోని నాడులు క్రమంగా పనిచేయకుండా మానేస్తాయి. దీనినే డయాబెటిక్‌ న్యూరో పతి అంటారు. ఈ సమస్యను గుర్తించడం ఆలస్యం అయితే చిన్న గాయం కూడా పెను ముప్పుగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. కొన్నిసార్లు ఈ సమస్య కాళ్లు కోల్పోయే పరిస్థితికి తీసుకెళ్తుందంటున్నారు నిపుణులు. అదెలాగో చూద్దాం. నిపుణుల ప్రకారం..దీర్ఘకాలంగా షుగర్‌ వ్యాధితో బాధపడుతున్నవారిలో నాడీ వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఎక్కువగా ఉంటుందట. ముఖ్యంగా పాదాల్లో స్పర్శ తగ్గిపోవడం, కాలికి గాయం అయినా నొప్పి తెలియకపోవడంలాంటి లక్షణాలు ఉంటాయి. రక్త ప్రసరణ సరిగా లేక గాయం మానడానికి సమయం పడుతుంది. అదే సమయంలో ఇన్‌ఫెక్షన్‌ శరీరంలోకి చొచ్చుకుపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పరిస్థితి చేయి దాటితే ప్రాణాలు కాపాడేందుకు కాలును తొలగించాల్సిన పరిస్థితి రావచ్చు. ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో ఉస్మానియా ఆసుపత్రి మధుమేహ బాధితులకు అండగా నిలుస్తోంది. ఇక్కడ ‘డయాబెటిక్‌ ఫుట్‌ కేర్‌ క్లినిక్‌’లో పాదాలకు సంబంధించిన సమస్యలను ప్రత్యేకంగా గుర్తించి చికిత్స అందిస్తున్నారు. ప్రతిరోజూ వందల సంఖ్యలో రోగులు ఈ క్లినిక్‌కు వస్తుండగా, ఎక్కువ మంది 30 నుంచి 70 ఏళ్ల మధ్య వయసు వారే ఉంటున్నారు. మహిళలకంటే పురుషులే అధికంగా ఈ చికిత్స పొందుతున్నారు. కాళ్లలో అల్సర్లు, పుండ్లు, మానని గాయాలతో బాధపడుతూ వచ్చే రోగులను ముందుగా స్క్రీనింగ్‌ చేసి, న్యూరోపతి ఉందా లేదా అన్నది వైద్యులు నిర్ధారిస్తున్నారు. పరిస్థితిని బట్టి గాయాలకు చికిత్స చేయడంతో పాటు, మళ్లీ గాయాలు కాకుండా ప్రత్యేకంగా రూపొందించిన చెప్పులను కూడా అందిస్తున్నారు. పేద రోగులకు ఈ సేవలు పూర్తిగా ఉచితంగా లభిస్తున్నాయి. గత రెండేళ్లలో దాదాపు రెండు వేల మంది డయాబెటిక్‌ న్యూరోపతి రోగులకు చికిత్స అందించామని, వారిలో 200 మందికి ప్రత్యేక చెప్పులు పంపిణీ చేసినట్లు వైద్యులు తెలిపారు. షుగర్‌ ఉన్నవారు కాళ్లను నిర్లక్ష్యం చేయకుండా ప్రతిరోజూ పరిశీలించుకోవడం, చిన్న సమస్య కనిపించినా వెంటనే ఆసుపత్రిని సంప్రదించడం ద్వారా పెద్ద ప్రమాదాలను తప్పించుకోవచ్చని డాక్టర్స్ సూచిస్తున్నారు. ఈ సేవలను టెలి కాల్ ద్వారా ముందే బుక్ చేసుకుని.. సమయం వృథా కాకుండా చికిత్స పొందవచ్చంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రూ. 78 లక్షల హాస్పిటల్‌ బిల్లును.. రూ.21 లక్షలకు తగ్గించిన AI

గ్రీన్‌ల్యాండ్ మంచు కింద అమెరికా అణు రియాక్టర్‌

సీక్వెల్స్ వస్తున్నాయి.. ఇప్పుడు కాదు.. మరి ఇంకెప్పుడు

Dhurandhar: ఇండియన్ సినిమాలో ధురంధర్ సంచలనాలు.. బాలీవుడ్‌లో రికార్డుల సునామీ

Sharwanand: శర్వానంద్ గ్రాండ్ రీఎంట్రీ.. ఒక్క హిట్టుతో జోరు మాములుగా లేదుగా

Follow Us