AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ట్రాఫిక్‌ రూల్స్‌ మరింత కఠినం.. 5 దాటితే అంతే సంగతులు..

ట్రాఫిక్‌ రూల్స్‌ మరింత కఠినం.. 5 దాటితే అంతే సంగతులు..

Phani CH
|

Updated on: Jan 25, 2026 | 9:30 AM

Share

జనవరి 1, 2026 నుండి కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి వస్తాయి. ఏడాదిలో ఐదుసార్లు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు అవుతుంది. రోడ్డు భద్రత పెంపు, habitual ఉల్లంఘనదారులకు కట్టడి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ మార్పులు చేసింది. హెల్మెట్, సీట్‌బెల్ట్, రెడ్ సిగ్నల్ జంపింగ్ వంటి సాధారణ తప్పులు కూడా ఇప్పుడు తీవ్ర పరిణామాలకు దారితీస్తాయి. మీ లైసెన్స్ రద్దు కాకుండా నిబంధనలు పాటించండి.

ట్రాఫిక్‌ రూల్స్‌ మరింత కఠినతరం చేసింది కేంద్రప్రభుత్వం. జనవరి 1, 2026 నుంచి ఈ కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఏడాదిలో 5 లేదా అంతకంటే ఎక్కువసార్లు ట్రాఫిక్‌ రూల్స్‌ ఉల్లంఘనకు పాల్పడితే మీ లైసెన్స్‌ రద్దు చేస్తుంది. రోడ్డు భద్రతను మెరుగుపరచడం, అలవాటుగా నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులకు కట్టడి విధించడమే లక్ష్యంగా కేంద్ర రవాణా శాఖ జాతీయ మోటారు వాహనాల నిబంధనల్లో ఈ సవరణ చేసింది. ఈ నిబంధనల ప్రకారం లైసెన్స్‌ను సస్పెండ్‌ చేయడం లేదా రద్దు చేయడం సంబంధిత ప్రాంతీయ రవాణా కార్యాలయం (RTO) లేదా జిల్లా రవాణా కార్యాలయం (DTO) పరిధిలో ఉంటుంది. అయితే నేరుగా చర్యలు తీసుకునే ముందు, సంబంధిత లైసెన్స్‌దారుడికి తన వాదన వినిపించే అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. అధికారిక నోటిఫికేషన్‌ ప్రకారం ఐదు తప్పిదాల లెక్కింపు రోలింగ్‌ పద్ధతిలో ఉంటుంది. అంటే ఒక నిర్దిష్ట తేదీ నుంచి ఏడాది వ్యవధిలో జరిగిన తప్పిదాలే పరిగణనలోకి వస్తాయి. గత ఏడాది ఉల్లంఘనలు తదుపరి ఏడాది లెక్కలోకి రావు. ఇంతకుముందు రూల్స్ ప్రకారం వాహన దొంగతనం, ప్రయాణికులపై దాడి, ప్రమాదకర వేగం, అధిక లోడ్‌, వాహనాన్ని రోడ్డుపై వదిలేయడం వంటి 24 తీవ్రమైన నేరాలు జరిగితేనే లైసెన్స్‌ రద్దు చేసేవారు. కానీ ఇప్పుడు తీసుకొచ్చిన ఐదు తప్పిదాల నిబంధనతో సాధారణంగా రోజూ జరిగే చిన్న ఉల్లంఘనలు కూడా లెక్కలోకి వస్తాయి. హెల్మెట్‌ లేకుండా వాహనం నడపడం, సీట్‌బెల్ట్‌ ధరించకపోవడం, రెడ్‌ సిగ్నల్‌ జంప్‌ చేయడం వంటి సాధారణంగా పట్టించుకోని తప్పిదాలు రిపీట్ ఐతే.. లైసెన్స్‌ రద్దుకు దారి తీస్తాయి. కాబట్టి వాహనదారులూ.. బీ కేర్‌ఫుల్‌.. ట్రాఫిక్‌ నిబంధనలను ఇకపై కచ్చితంగా పాటించాల్సిందే సుమా!

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Gold Price Today: భగ్గుమంటున్న బంగారం.. ఇవాళ ధర ఎంతంటే

రథసప్తమి వేళ అరసవిల్లిలో అర్ధరాత్రి నుంచే పూజలు ప్రారంభం

TOP 9 ET: చిక్కుల్లో చిరు నెక్స్ట్‌ మూవీ ?? | బుక్ మై షోలో.. బాస్ దిమ్మతిరిగే రికార్డ్

The Raja Saab: రాజాసాబ్‌కు రూ.100 కోట్ల నష్టం ??

షాకింగ్‌ న్యూస్‌.. అరికాళ్ళపై షుగర్ దాడి