Sunita Williams: నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ కీలక నిర్ణయం
భారత సంతతికి చెందిన ప్రముఖ నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ నాసా నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించారు. గత డిసెంబర్ 27 నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చిందని నాసా వెల్లడించింది. 27 ఏళ్ల అద్భుతమైన కెరీర్‌లో ఆమె 9 స్పేస్ వాక్‌లు చేసి, 608 రోజులు అంతరిక్షంలో గడిపారు. అంతరిక్షంలో మారథాన్ పరిగెత్తిన మొదటి వ్యక్తిగా, అత్యధిక సమయం స్పేస్ వాక్ చేసిన మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు.
భారత సంతతికి చెందిన ప్రముఖ నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నాసా నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించారు. కాగా, గతేడాది డిసెంబరు 27 నుంచే ఇది అమల్లోకి వచ్చిందని తాజాగా నాసా పేర్కొంది. నేషనల్ ఆరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ లో వ్యోమగామిగా వ్యవహరిస్తున్న సునీతా విలియమ్స్, తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. 2025, డిసెంబర్ 27 నుంచే తాను రిటైర్మెంట్ తీసుకున్నట్టుగా ప్రకటించారు సునీతా విలియమ్స్. ఓహియాలో పుట్టిన సునీతా తండ్రి దీపక్ పాండ్యా భారతీయుడు. గుజరాత్‌కి చెందిన దీపక్ పాండ్యా, అమెరికన్ అయిన ఉర్సులైన్ బోనీని పెళ్లి చేసుకున్నారు. వీరికి 1965, సెప్టెంబర్ 19న సునీతా విలియమ్స్ జన్మించారు. 1998లో నాసాలో చేరిన సునీతా విలియమ్స్, 27 ఏళ్ల కెరీర్‌లో 9 సార్లు స్పేస్ వాక్ చేశారు. మొదటిసారి స్పేస్‌లోకి అడుగుపెట్టిన సమయంలో తనతో పాటు ఓ జెండా , ఓ సమోసా, కర్నోలియన్ సాస్ తీసుకెళ్లారు. తన తండ్రి భారత్‌కి చెందినవాడు కావడంతో ఇండియాకి ప్రతిచిహ్నంగా సమోసాని తీసుకెళ్లినట్టు ప్రకటించారు సునీతా విలియమ్స్. 2024 జూన్ 5న సునీత, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్‌లు వారంరోజుల రోదసి యాత్ర చేపట్టారు. అయితే, సాంకేతిక సమస్య వల్ల వారు దాదాపు 9 నెలలపాటు అంతరిక్షంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో ఈ అంతరిక్షయానం ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇక, సునీత మొత్తం 608 రోజులు అంతరిక్షంలోనే ఉన్నారు. తన కెరీర్‌లో మొత్తంగా సునీతా విలియమ్స్ 9 సార్లు స్పేస్ వాక్ చేసింది. ఇందులో 62 గంటల 6 నిమిషాలు అంతరిక్షంలో నడిచి, అత్యధిక సమయం స్పేస్ వాక్ చేసిన మహిళగా రికార్డు క్రియేట్ చేసారు. 2007, ఏప్రిల్ 16న మొదటిసారి సునీతా విలియమ్స్, స్పేస్‌లో తొలి మారథాన్ పరుగెత్తింది. అంతరిక్షంలో మారథాన్ పరుగెత్తిన మొట్టమొదటి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
SSC Exams 2026: ఏపీలో టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల
యజమాని మరణించడంతో శోకసంద్రంలో శునకం..
ఆంధ్రా భోజనం రుచికి.. జపాన్ అధికారులు ఫిదా
యజమాని మరణించడంతో శోకసంద్రంలో శునకం..
ఆంధ్రా భోజనం రుచికి.. జపాన్ అధికారులు ఫిదా
డెలివరీ బాయ్‌గా మారిన ఎమ్మెల్యే.. 'ఏ పనీ తక్కువ కాదన్న నేత'
అసలు మీరు ఐఏఎస్ కు ఎలా సెలక్టయ్యారు ?? విద్యార్థి ప్రశ్న
పురుషుని కడుపులో గర్భాశయం.. రిపోర్టు చూసి అవాక్కైన వ్యక్తి
'డిజిటల్ లంచం'.. ఇప్పుడు షాకింగ్ ట్రెండ్
బుర్ఖా ధరించి చైన్ స్నాచింగ్.. కట్ చేస్తే..

