AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

'డిజిటల్ లంచం'.. ఇప్పుడు షాకింగ్ ట్రెండ్‌

‘డిజిటల్ లంచం’.. ఇప్పుడు షాకింగ్ ట్రెండ్‌

Phani CH
|

Updated on: Jan 23, 2026 | 9:20 AM

Share

పిల్లలు ఏడుస్తున్నారని, అల్లరి చేస్తున్నారని స్మార్ట్‌ఫోన్ ఇస్తున్నారా? దీనినే 'స్క్రీన్ బ్రైబ్' అంటారు. ఈ అలవాటు పిల్లల భాషా నైపుణ్యాలు, సామాజిక సంబంధాలు, భావోద్వేగ నియంత్రణ, సృజనాత్మకతను దెబ్బతీస్తుంది. మాటలు ఆలస్యం కావడం, ఒంటరితనం, కోపం పెరగడం వంటివి దీని దుష్ప్రభావాలు. ఈ గాడ్జెట్ వారి మేధస్సును హరించే ఆయుధం అని గుర్తించి, ఫోన్ బదులు వారితో సమయం గడపడం మంచిది.

పిల్లలు అన్నం తినడం లేదనో.. అల్లరి చేస్తున్నారనో స్మార్ట్‌ఫోన్ ఇస్తున్నారా? ఇక వారు స్క్రీన్ బ్రైబ్ ట్రాప్‌లో పడిపోయినట్టే. దీనివల్ల మీ పిల్లలు ఏం కోల్పోతున్నారో తెలిస్తే షాక్ అవుతారు. పిల్లల చేతికి ఫోన్ ఇవ్వడాన్ని స్క్రీన్ బ్రైబ్ అంటారు. ఇది తాత్కాలికంగా ఉపశమనం కలిగించినా, దీర్ఘకాలంలో పిల్లలను మానసిక రోగులుగా మార్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. ఈ అలవాటు తో తల్లిదండ్రులు తమ పిల్లల నుంచి 4 అత్యంత విలువైన విషయాలను దొంగిలిస్తున్నట్లే లెక్క. పిల్లలు ఇతరులతో మాట్లాడితేనే భాష వస్తుంది. ఫోన్‌కు అలవాటు పడిన పిల్లలు కేవలం వినడానికే పరిమితం అవుతున్నారు. దీంతో వారిలో కమ్యూనికేషన్ స్కిల్స్ దెబ్బతింటున్నాయి. నేటి కాలంలో చాలామంది పిల్లల్లో స్పీచ్ డిలే… అంటే మాటలు ఆలస్యంగా రావడానికి ప్రధాన కారణం ఇదే. చుట్టుపక్కల మనుషులతో ఎలా ఉండాలి? ఎవరైనా వస్తే ఎలా పలకరించాలి? మానవ సంబంధాల విషయంలో పిల్లలు వెనకబడుతున్నారు. స్క్రీన్ ప్రపంచంలో మునిగిపోతూ ఒంటరితనాన్ని అలవాటు చేసుకుంటున్నారు. ఇది భవిష్యత్తులో వారిని మొండివారిగా మార్చే అవకాశం ఉంది. పిల్లలకు బోర్ కొట్టినప్పుడు వారు ఆసక్తికర విషయాల వైపుకి మళ్ళుతారు. కానీ ఆ ఖాళీని ఫోన్‌తో నింపడం వల్ల వారిలో ఓర్పు నశిస్తోంది. ఫోన్ లాక్కున్న వెంటనే విపరీతమైన కోపం తెచ్చుకోవడం, వస్తువులను విసిరేయడం వంటి లక్షణాలు ప్రదర్శిస్తున్నారు. తమ భావోద్వేగాలను ఎలా అదుపు చేసుకోవాలో వారు నేర్చుకోలేకపోతున్నారు. ఖాళీ సమయంలో పిల్లలు మట్టిలో ఆడటం, బొమ్మలు గీయడం వంటివి చేయాలి. కానీ నిరంతరం వీడియోలు చూడటం వల్ల వారి మెదడు ఆలోచించడం మానేస్తుంది. కేవలం స్క్రీన్‌పై వచ్చే రంగులు, శబ్దాలకు మాత్రమే వారు స్పందిస్తారు. దీనివల్ల వారిలో క్రియేటివిటీ పూర్తిగా నశించిపోతుంది. కాబట్టి పిల్లలను ఆడించడానికి ఫోన్‌ను ఒక సాధనంగా వాడకండి. పిల్లలకు బోర్ కొడితేనే వారు కొత్త ఆటలను కనిపెడతారు. వారి ఆలోచనలకు పదును పెట్టనివ్వండి. రోజులో కనీసం గంట సేపు ఫోన్లు పక్కన పెట్టి పిల్లలతో గడపండి. వారితో కలిసి చిన్న చిన్న ఇంటి పనులు చేయండి. మీ బిడ్డ చేతిలో ఉన్న ఫోన్ కేవలం ఒక గ్యాడ్జెట్ మాత్రమే కాదు.. అది వారి మేధస్సును హరించే ఆయుధం అని గుర్తుంచుకోండి. ఇప్పటికైనా మేల్కొనకపోతే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కర్తవ్యం కానిస్టేబుల్ కు.. ఏపీ హోం మంత్రి ఆత్మీయ సత్కారం

ఒకే చోట పూజ.. నమాజ్ ! సుప్రీం సంచలన తీర్పు

ప్రేమికులను వేటాడి చంపిన కసాయి అన్నలు

మొక్కులో వింత.. భక్తుల్లో మంట !! తప్పు ఒప్పుకున్న టీనా శ్రావ్య

టోల్‌ బకాయిలుంటే వాహన సేవలు బంద్‌