AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు.. చూడటానికి రెండు కళ్ళు చాలడం లేదు

రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు.. చూడటానికి రెండు కళ్ళు చాలడం లేదు

Phani CH
|

Updated on: Jan 23, 2026 | 1:19 PM

Share

కెస్లాపూర్ నాగోబా జాతర వైభవంగా జరుగుతోంది. మెస్రం వంశీయులు తమ ప్రత్యేక పూజలతో ఈ ఆదివాసీ పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు. టెక్నాలజీ యుగంలోనూ ఎడ్ల బండ్లపై ప్రయాణిస్తూ పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తున్నారు. కొత్త కోడళ్లకు జాతర చరిత్రను వివరించి, సంప్రదాయ వంటకాలతో దీక్ష విరమింపజేశారు. ఈ జాతర తరతరాల మెస్రం సంప్రదాయానికి, గిరిజన ఐక్యతకు ప్రతీక.

కెస్లాపూర్ నాగోబా జాతర వైభవంగా కొనసాగుతోంది. మెస్రం వంశీయుల ప్రత్యేక పూజలతో నాగోబా సంబరం అంబరాన్ని అంటుతోంది. మహారాష్ట్ర , చత్తీస్‌గఢ్ , జార్ఖండ్ , ఆంద్రప్రదేశ్ , తెలంగాణలోని గిరిజన పల్లెల నుండి మెస్రం వంశీయులు పెద్ద ఎత్తున జాతరకు హాజరవుతున్నారు. దేశం నలుమూలల ఉన్న మెస్రం వంశీయులను ఒక్కటి చేసే జాతర గా నాగోబాకు పేరుంది. తరాలు మారినా తరగని సంప్రదాయం ఆదివాసీల సొంతంగా సాగుతోంది. ఎడ్ల బండ్లే వాహనాలుగా చెట్ల కిందే సేదతీరుతూ సాగుతున్న జాతర అబ్బురపరుస్తోంది. మహారాష్ట్ర , తెలంగాణ , చత్తీస్‌గఢ్ రాష్ట్రం ఏదైనా ఎడ్ల బండే వారి ప్రయాణ వాహనం. సకుటుంబ సపరివార సమేతంగా ఎడ్ల బండిలోనే ప్రయాణిస్తారు. టెక్నాలజీ యుగంలో మనిషి రయ్యున దూసుకెళుతున్నా.. సరికొత్త వాహనాలు బహిరంగ మార్కెట్ లో సందడి చేస్తున్నా ఆదివాసీలు మాత్రం వాటి జోలికి వెళ్లరు. బైక్ లు, బస్సులను దూరం పెడుతూ ఎడ్ల బండిలోనే ఎంత దూరమైన ప్రయాణం సాగిస్తున్నారు‌. నాగోబా జాతరకు వచ్చే మెస్రం వంశీయులు ఈ ఎడ్ల బండి నియమాన్ని తూచ తప్పకుండా పాటిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ ఎడ్లబండి వాహనాలు ఉపయోగిస్తున్నట్టు చెప్తున్నారు మెస్రం వంశీయులు. నాగోబా జాతర నాలుగవ రోజుకు‌ చేరింది. మూడవ రోజు ఉదయం నుంచి గోవాడాలో పర్గాన్ పెద్దలు కొత్త కోడళ్లకు కిక్రీ ద్వారా నాగోబా చరిత్రను వివరించారు. 22 తెగలకు చెందిన మెస్రం వంశీయుల కొత్త కోడళ్లకు వారి సంప్రదాయ వంటకాలైన జొన్న గటుక, సాంబారు, జొన్నగటుక లడ్డూలను మెస్రం మహిళలు తయారు చేసి పంపిణీ చేశారు. ఉపవాస దీక్షలో ఉన్న కొత్త కోడళ్లు గటక లడ్డూలతో దీక్ష విరమించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పాపం గూగుల్‌ మ్యాప్‌కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని

డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్‌కి రాత్రి 11 గంటలకు ఫోన్‌.. సీన్ కట్ చేస్తే

Chili Price: ఘాటెక్కిన మిర్చి.. ధరలో పసిడితో పోటీ..

Sunita Williams: నాసా వ్యోమగామి సునీత విలియమ్స్‌ కీలక నిర్ణయం

SSC Exams 2026: ఏపీలో టెన్త్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల