టాలీవుడ్ మార్కెట్ కావాలి.. కానీ తెలుగు టైటిల్స్ పెట్టరా.. అరే ఏంట్రా ఇది
తెలుగు మార్కెట్ కోసం తమిళ, మలయాళ చిత్రాలు అర్థం కాని తమ సొంత భాషా టైటిల్స్‌తో విడుదలవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. టాలీవుడ్ ఆదరణను కోరుకుంటూ, డబ్బింగ్ చిత్రాలకు కనీసం తెలుగు టైటిల్స్ పెట్టకపోవడం తెలుగు ప్రేక్షకులనూ, మార్కెట్‌నూ చిన్నచూపు చూసినట్లేనని విశ్లేషకులు అంటున్నారు. రజనీకాంత్, సూర్య వంటి అగ్రతారల సినిమాలు సైతం ఈ ధోరణిని అనుసరిస్తుండటంతో, తెలుగు భాషకు ప్రాధాన్యత ఇవ్వాలనే డిమాండ్ బలపడుతోంది.
తమిళనాడు, కేరళ వెళ్లి తెలుగు మాట్లాడితే ఊరుకుంటారా..? మరి తెలుగులో రిలీజ్ చేస్తున్నపుడు అర్థం కాని తమిళ, మలయాళ టైటిల్స్ ఎందుకు పెడుతున్నారు..? టాలీవుడ్ మార్కెట్ కావాలి కానీ తెలుగు టైటిల్ పెట్టరా.? డబ్బింగ్ చేస్తున్నపుడు కనీసం ఓ తెలుగు పేరు పెట్టలేకపోతున్నారా..? తాజాగా మరో సినిమా అలాగే వచ్చేస్తుంది. టాలీవుడ్ అంటే ఎందుకంత చిన్నచూపు..? ఇదే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ.. ఇండియాలో ఉన్న ప్రతి హీరోకు తెలుగు మార్కెట్ కావాలిపుడు. ఇక్కడ మార్కెట్ సంపాదిస్తే ఇండియాపై పట్టు సాధించినట్లే. అయితే మార్కెట్‌పై చూపించిన శ్రద్ధ తమ టైటిల్స్‌పై చూపించట్లేదు. తమిళ హీరోలను చూసి మలయాళ హీరోలు సైతం టాలీవుడ్‌ను అత్తగారిల్లులా ఫీల్ అవుతూ.. అర్థం పర్థం టైటిల్స్‌తో తెలుగులోకి వస్తున్నారు. తాజాగా పల్లిచట్టాంబి అనే మరో సినిమా వస్తుంది. టొవినో థామస్ హీరోగా వస్తున్న సినిమాకు పల్లిచట్టాంబి అనే టైటిల్ పెట్టారు.. దాని అర్థమేంటో తెలియదు.. పల్లీలు పొట్లం కడుతున్నారా అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఆ మధ్య సూర్య సినిమాకు కరుప్పు టైటిల్ కన్ఫర్మ్ చేసారు.. గతంలోనూ ఈటీ, కంగువా అంటూ తమిళ టైటిల్స్‌తోనే వచ్చి విమర్శల పాలయ్యారు సూర్య.. అయినా కూడా మారలేదు. శివకార్తికేయన్ నటించిన అయలాన్, అమరన్ తెలుగులో అవే పేర్లతో వచ్చాయి. కంటెంట్ బాగుండి అమరన్ హిట్టైంది కూడా. మదరాసి అదే పేరుతో విడుదలైంది. ఆ మధ్య కొత్త లోక కూడా అదే పేరుతో తెలుగులో విడుదలై విజయం సాధించింది. టాలీవుడ్ నుంచి వచ్చే డబ్బులు కావాలి.. కానీ తెలుగు వాళ్ల మనోభావాలతో పని లేదా అనే విమర్శలు ఎక్కువవుతున్నాయి. అజిత్ కూడా తునివు, వలిమై అంటూ అర్థం కాని పేర్లతో వస్తే.. తంగలాన్, వీర ధీర సూరన్ అంటూ సేమ్ టైటిల్స్‌తో వచ్చారు విక్రమ్. ప్రభుదేవా మరీ దారుణం.. ఆయన సినిమా టైటిల్ ఏంటో తెలుసా.. ఉల్ఫా..! మోహన్ లాల్ తుడరుమ్, ఎంపురాన్ అవే పేర్లతో వచ్చాయి. రజినీకాంత్ సైతం వేట్టయాన్‌గా వచ్చి విమర్శల పాలయ్యారు. మరి దీనికి అంతం ఎప్పుడు..?
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తెలుగు ఇండస్ట్రీలో లక్కీ ఛామ్.. ముద్దుగుమ్మ ఉంటే సినిమా హిట్టే
Vijay Deverakonda: వామ్మో! మరీ ఇలా ప్లాన్ చేసాక.. రౌడీ ఇంక దొరుకుతాడా..
Varanasi: వారణాసి విషయంలో రాజమౌళి సంచలన నిర్ణయం
Venkatesh: ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌పై వెంకటేష్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్
Top 9 ET: అన్న విజయానికి తమ్ముడి క్రేజీ రియాక్షన్ | బాస్ దెబ్బకు..కళ్ల ముందుకు గత వైభవం
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్‌కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని
డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్‌కి రాత్రి 11 గంటలకు ఫోన్.. కట్ చేస్తే
యజమాని మరణించడంతో శోకసంద్రంలో శునకం..
ఆంధ్రా భోజనం రుచికి.. జపాన్ అధికారులు ఫిదా

