OTT Movie: 30 కోట్లతో తీస్తే 143 కోట్లు.. ఓటీటీలోకి బాక్సాఫీస్ సెన్సేషన్.. ఐఎమ్‌డీబీలోనూ టాప్ రేటింగ్ మూవీ
గతేడాది క్రిస్మస్ కానుకగా విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రిలీజ్ అయిన 10 రోజుల్లోనే రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. వసూళ్ల పర్సంటేజ్ పరంగా చూసుకుంటే ఈ మూవీ బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ధురంధర్ రికార్డును ఈ సినిమా బ్రేక్ చేసినట్లే

గత కొన్ని రోజులుగా ‘ధురంధర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ సినిమా ధాటికి బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులు బద్దలయ్యాయి. రూ. 1300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా అనేక పెద్ద చిత్రాల రికార్డులను అధిగమించింది. అయితే, గతేడాది డిసెంబర్ 25 ఒక స్టార్ హీరోకు తన జీవితంలోనే ఒక ప్రత్యేక రోజుగా మారింది. ఆ రోజున విడుదలైన ఒక చిత్రం ప్రేక్షకుల హృదయాలను మాత్రమే కాకుండా బాక్సాఫీస్‌ను కూడా గెలుచుకుంది. అతను మరెవరో కాదు మలయాళం నటుడు, ప్రేమమ్ మూవీ నటుడు నివిన్ పౌలీ. 2025 ముగింపు, 2026 ప్రారంభం ఈ స్టార్ హీరోకు ఒక కలలా ఉన్నాయి. ఎందుకంటే అతను నటించిన ఒక సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. IMDb ప్రకారం ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 143 కోట్లు వసూలు చేసింది. ఆసక్తికరంగా, ఈ చిత్రం బడ్జెట్ కేవలం రూ. 30 కోట్లు మాత్రమే. ‘ధురంధర్’ వంటి భారీ బడ్జెట్ అండ్ బ్లాక్ బస్టర్ మూవీ పోటీలో ఉన్నప్పటికీ ఈ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేసింది.
‘ప్రేమమ్ ‘ సినిమాతో తెలుగు ఆడియెన్స్ కు కూడా ఫేవరెట్ గా మారిపోయాడు నివిన్ పౌలీ. అందులో అతను పోషించిన జార్జ్ డేవిడ్ పాత్రను ప్రేక్షకులు ఇప్పటికీ గుర్తుంచుకుంటారు. అయితే, 2018 తర్వాత, నివిన్ కెరీర్‌లో ఒడిదుడుకులు మొదలయ్యాయి. సాటర్డే నైట్, మహావీరియార్, పడవెట్టు, మలయాళీ ఫ్రమ్ ఇండియా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని సాధించలేకపోయాయి. దీని కారణంగా, నివిన్ ఇమేజ్ క్రమంగా దిగజారింది. నివిన్ నటనా నైపుణ్యాలకు తగిన బలమైన స్క్రిప్ట్ అవసరమన్న అభిప్రాయాలు కూడా వినిపించాయి.
దీంతో చివరకు నివిన్ పౌలీ ‘సర్వం మాయ’ అనే ఒక డిఫరెంట్ స్క్రిప్ట్‌ను ఎంచుకున్నాడు. ఇది అతని కెరీర్ ను కొత్త మలుపు తిప్పింది. అఖిల్ సత్యన్ తెరకెక్కించిన ఈ హారర కామెడీ థ్రిల్లర్ లో నివిన్ పౌలీ నటన హైలెట్ గా నిలిచింది. అతని కెరీర్ లోనే ఈమూవీ అతిపెద్ద హిట్ చిత్రంగా నిలిచింది. రిలీజైన కేవలం రోజుల్లోనే రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన సర్వం మాయ మూవీ ఓఓవరాల్ గా రూ. 150 కోట్లకు చేరువలో ఉంది. అయితే త్వరలోనే ఈ మూవీ ఓటీటీలోకి రానుందని సమాచారం. జియో హాట్ స్టార్ లో సర్వం మాయ స్ట్రీమింగ్ కానుందని టాక్. ఫిబ్రవరి మొదటి వారంలో తమిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి స్ట్రీమింగ్ కు రావొచ్చని సమాచారం.
నెలరోజులైనా రికార్డు స్థాయి కలెక్షన్లు..
#SarvamMaya 29 Days Worldwide ₹146.4cr 💥
Just ₹3.6cr Short From ONE FIFTY Club!
Week 5 Continues In Kerala / ROI & Middle East Good Number Of Screens. Kerala Tomorrow Around 350+ Shows Despite #BabyGirl Entry.
PhotoFinish Loading…!🤞 pic.twitter.com/XNj3em0k9g
— Heyopinions (@heyopinionx) January 22, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




