మేడారం గద్దెలకు కొత్త రూపు వీడియో
తెలంగాణ కుంభమేళాకు సర్వం సిద్ధమవుతోంది. రెండేళ్లకోసారి జరిగే మేడారం జాతర వచ్చే ఏడాది జనవరి 28 నుంచి నాలుగు రోజులు పాటు అంగరంగవైభవంగా జరగనుంది. గిరిజన దేవతలు సమ్మక్క సారక్కలు కొలువుదీరిన మేడారం ఇప్పుడు కొత్త రూపు దిద్దుకుంటోంది. పూర్తిగా గ్రానైట్ నిర్మాణాలతో మహా అద్భుత క్షేత్రంగా వెలిగిపోతోంది. ఇప్పటికే పునర్‌నిర్మాణ పనులు 70% పూర్తయ్యాయి. మంగళవారం మంత్రులు పొంగులేటి, సీతక్క, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి అభివృద్ది పనులను పరిశీలించారు.
ఆధునీకరణ పనుల్లో తొలిఘట్టం పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెల పునః ప్రతిష్టాపన ఈ బుధవారం ఉదయం జరగబోతోంది. అడవి నుండి ఐదు సార్లు ఎర్రమట్టి తీసుకొచ్చి, పందిరి వేసి పూర్తిగా ఆదివాసీ ఆచార సంప్రదాయాల ప్రకారం గద్దెల పునః ప్రతిష్టాపన చేస్తారు. ఈ సందర్భంగా ప్రాంగణం మొత్తాన్ని దిగ్బంధనం చేస్తారు. పూర్తిగా అంతర్గత పూజల ద్వారా జరిగే పున ప్రతిష్టాపనకు సామాన్య భక్తులకు ప్రవేశం లేదు.మేడారం గద్దెల చుట్టూ నాలుగు టవర్ల నిర్మాణం, మేడారం పరిసర ప్రాంతాల్లో పూర్తిగా మెడిసినల్ ప్లాంట్స్ పెంచేలా ప్లాన్ చేశారు. భూకంపాలు, ఉప ద్రవాలను ఎదుర్కొనేలా నిర్మాణాలు చేస్తున్నారు. ఎన్నేళ్లయినా చెక్కుచెదరకుండా మేడారం చరిత్ర భావితరాలు చర్చించుకునేలా పూర్తిగా గ్రానైట్ తో అద్భుత రూపు దిద్దుకుంటోంది. ఇక్కడ ప్రతిష్టించే ప్రతీ రాతి నిర్మాణం పూర్తిగా ఆదివాసి ఆచార సాంప్రదాయాలు, గొట్టు గోత్రాల్ని ప్రతిబింబించేలా జరిగింది. గద్దెల ప్రాంగణంలో దాదాపు నాలుగు వేల టన్నుల గ్రానైట్ ఉపయోగిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
స్టార్ హీరోలు కూడా భయపడుతుంటే.. కాజల్ ఒక్కతే ధైర్యంగా కామెంట్ చేసింది వీడియో
మేడారం గద్దెలకు కొత్త రూపు వీడియో
గడ్డకడుతున్న జలపాతాలు వీడియో
ఈ ఏడాది మోస్ట్ పాపులర్ వైరల్ వీడియోస్.. ఇవే వీడియో
ప్రియుడి కోసం భర్త బలి అమ్మో.. ఆడోళ్లు ఇలా తయారేంట్రా బాబు వీడియో
దూసుకెళ్తున్న బంగారం,వెండి ధరలు వీడియో
2 గంటల్లో ముంబై టు దుబాయ్.. అది కూడా రైల్లో వీడియో
సమంత కోసం ఎయిర్పోర్ట్కు రాజ్ నిడిమోరు వీడియో
