Weather Alert: బాబోయ్ చలి.. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఏలా ఉంటుంది.. ఇదిగో వెదర్ రిపోర్ట్
అమ్మో చలి.. స్వెట్టర్లు ఆగడం లేదు. బ్లాంకెట్లు, దుప్పట్లు కప్పుకున్నా.. వణుకు తగ్గట్లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కే పడిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఒక రోజు కాదు, రెండు రోజులు కాదు. రెండు వారాలుగా తెలుగు రాష్ట్రాలపై చలి పంజా విసురుతోంది.

అమ్మో చలి.. స్వెట్టర్లు ఆగడం లేదు. బ్లాంకెట్లు, దుప్పట్లు కప్పుకున్నా.. వణుకు తగ్గట్లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కే పడిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఒక రోజు కాదు, రెండు రోజులు కాదు. రెండు వారాలుగా తెలుగు రాష్ట్రాలపై చలి పంజా విసురుతోంది. తీవ్రమైన చలితో పాటు విపరీతంగా కురుస్తోన్న మంచు.. వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఉదయం 8 కాదు కదా.. 10 గంటలైనా బయటకు రాలేని పరిస్థితి. డిసెంబర్ మొదటి నుంచీ తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. మున్ముందు టెంపరేచర్స్ అత్యంత కనిష్టానికి పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వచ్చే 4 రోజులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయని, జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ – వాతావరణ హెచ్చరికలు :
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలో క్రింది స్థాయి గాలులు ప్రధానముగా తూర్పు – ఈశాన్య దిశ నుండి వీస్తున్నవి.. దీని ప్రభావంతో ఈరోజు, రేపు మరియు ఎల్లుండి రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. రాబోయే రెండు రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3°C నుండి 4°C తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల 3 రోజుల వరకు వాతావరణ విశ్లేషణ:
అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ – యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి..
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్:- గురువారం, శుక్రవారం, శనివారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది.
రాయలసీమ:- గురువారం, శుక్రవారం, శనివారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది.
గమనిక :- రాగల 2 రోజుల్లో కోస్తా ఆంధ్రప్రదేశ్, యానం, రాయలసీమ లో కనిష్ట ఉష్ణోగ్రతలు ఒకటి లేదా రెండు చోట్ల సాధారణము కంటే 2-4 డిగ్రీల సెంటీగ్రేడ్ తక్కువగా నమోదయ్యే అవకాశముంది. ఆ తర్వాత పెద్దగా మార్పు ఉండదు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
