చలికాలంలో చర్మం పగలకుండా కాపాడే.. సౌందర్య మంత్రం ఇదే!

25 December 2025

TV9 Telugu

TV9 Telugu

స‌హ‌జంగానే చ‌లికాలంలో చాలా మందికి చ‌ర్మం ప‌గులుతుంది. కొంద‌రికి చ‌ర్మం ప‌గ‌ల‌డంతోపాటు దుర‌ద‌ కూడా వ‌స్తుంటుంది

TV9 Telugu

దీంతో చ‌ర్మంపై పొట్టు మాదిరి ఏర్పడి అంద విహీనంగా కూడా క‌నిపిస్తుంది. చ‌ర్మం కాంతిహీనంగా మారి డ‌ల్‌గా క‌నిపిస్తుంది. అందుకే చ‌లికాలంలో చ‌ర్మాన్ని ర‌క్షించుకోవ‌డం క‌ష్టంగా మారుతుంది

TV9 Telugu

నిజానికి చ‌లికాలంలో చ‌ల్ల గాలి వ‌ల్ల చ‌ర్మంలో ఉండే తేమ బ‌య‌ట‌కు వెళ్తుంది. దీంతో చ‌ర్మం పొడిగా మారి చ‌ర్మం పొట్టు రాల‌డం, దుర‌ద‌గా ఉండ‌డం వంటివి సంభ‌విస్తాయి

TV9 Telugu

అందుకే  శీతాకాలంలో చర్మ సమస్యలు పెరుగుతాయి. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల శీతాకాలంలోనూ చర్మ సంరక్షణ సాధ్యమే. ముఖ్యంగా శీతాకాలంలో వేడి నీటితో స్నానం చేయడం అంత మంచిది కాదు

TV9 Telugu

ఇది చర్మాన్ని పొడిబారుస్తుంది. బదులుగా  గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. శీతాకాలంలో నిద్ర లేకపోవడం వల్ల కూడా చర్మం నిస్తేజంగా మారుతుంది. తగినంత నిద్ర అవసరం

TV9 Telugu

చర్మాన్ని ఎక్కువసేపు మృదువుగా ఉంచడానికి వెచ్చని నీటితో స్నానం చేసిన వెంటనే మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. తేలికపాటి pH ఉన్న సబ్బును వాడాలి.  ఇది మీ చర్మం పొడిబారకుండా నిరోధిస్తుంది

TV9 Telugu

అలాగే శీతాకాలంలో తరచుగా తలకు నూనె రాసుకోవడం కూడా మంచిది కాదు. ఇది చుండ్రు ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి జుట్టుకు నూనె రాసుకున్న గంట తర్వాత తన స్నానం చేయడం మంచిది

TV9 Telugu

చర్మ నష్టంలో కాలుష్యం పాత్ర ఎక్కువే. కాబట్టి మీరు బయటకు వెళ్ళినప్పుడు కాలుష్యం నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి శరీరాన్ని కప్పుకోవాలి. వీటితోపాటు విటమిన్ ఇ, విటమిన్ సి, ఒమేగా-3 అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి