AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: కనిపెంచిన కొడుకును కడతేర్చిన తండ్రి.. కారణం తెలిస్తే షాకే

మద్యంలో గడ్డిమందు కలిపి ఇచ్చి.. కొడుకును చంపాడు తండ్రి. మద్యం తాగి జులాయిగా తిరుగుతున్న కొడుకు.. ఇద్దరి మధ్య కుటుంబ తగాదాల నేపథ్యంలో నాగరాజు(18) తాగే మద్యంలో తండ్రి రాజేష్ గడ్డిమందు కలిపాడు. తల్లాడ మండలం కలకోడిమలో గత నెల 20న ఘటన.. జరగ్గా చికిత్స పొందుతూ నేడు మృతి చెందాడు.

Telangana: కనిపెంచిన కొడుకును కడతేర్చిన తండ్రి.. కారణం తెలిస్తే షాకే
Telugu News Update
N Narayana Rao
| Edited By: Ravi Kiran|

Updated on: Nov 03, 2025 | 2:20 PM

Share

మద్యంలో గడ్డిమందు కలిపి ఇచ్చి.. కొడుకును చంపాడు తండ్రి. మద్యం తాగి జులాయిగా తిరుగుతున్న కొడుకు.. ఇద్దరి మధ్య కుటుంబ తగాదాల నేపథ్యంలో నాగరాజు(18) తాగే మద్యంలో తండ్రి రాజేష్ గడ్డిమందు కలిపాడు. తల్లాడ మండలం కలకోడిమలో గత నెల 20న ఘటన.. జరగ్గా చికిత్స పొందుతూ నేడు మృతి చెందాడు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కలకొడిమ గ్రామంలో కొడుకు మద్యానికి బానిసై తండ్రిపై దాడి చేస్తున్నాడని మద్యంలో గడ్డిమందు కలిపి కన్న కొడుకునే తండ్రి హతమార్చిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కలకొడిమ గ్రామానికి చెందిన ఆదూరి రాజేష్, ఆదూరి నాగరాజు(18) తండ్రీకొడుకులు. కుమారుడు నాగరాజు మద్యానికి బానిసై గ్రామంలో జులాయిగా తిరుగుతుండేవాడు. తండ్రి కూడా ఏ పనిలేక ఇంటి వద్దే ఉండేవాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య గత కొంతకాలంగా గొడవలు నడుస్తున్నాయి.

ఇది కాస్త ఇద్దరూ కొట్టుకునే స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో కొడుకు నాగరాజును మట్టుబెట్టాలని తండ్రి రాజేష్ నిర్ణయించుకున్నాడు. ముందస్తు పథకం ప్రకారం కలిసి మద్యం తాగుదామని నాగరాజును రాజేష్ నమ్మించాడు. ముందుగా అనుకున్నట్టు గత నెల 20వ తేదీన నాగరాజుకు గడ్డిమందు కలిపిన మద్యాన్ని రాజేష్ ఇచ్చాడు. మద్యం తాగిన నాగరాజుకు వాంతులు, విరేచనాలు కావడంతో.. ఏమి తెలియనట్టు తండ్రే కొడుకును చికిత్స నిమిత్తం ఖమ్మంలోని ఆసుపత్రికి తరలించాడు. నాగరాజు పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం కుటుంబీకులు అతన్ని హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ నాగరాజు నేడు మృతి చెందాడు. నాగరాజు పెద్దమ్మ మేరీ కుమారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.