Telangana: పొలాన్ని చదును చేస్తుండగా వినిపించిన వింత చప్పుళ్లు.. ఏంటా అని రైతు చూడగా
సాధారణంగా రైతులు నిత్యం పంట పొలాల్లోనే ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. పంటలు పండించేందుకు అన్నదాతలు భూమి చదును చేస్తుంటారు. తనకు ఉన్న వ్యవసాయ భూమిని ఓ రైతు చదును చేస్తుండగా.. అక్కడ కనిపించింది చూసి షాక్ తిన్నాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

సాధారణంగా రైతులు నిత్యం పంట పొలాల్లోనే ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. పంటలు పండించేందుకు అన్నదాతలు భూమి చదును చేస్తుంటారు. తనకు ఉన్న వ్యవసాయ భూమిని ఓ రైతు చదును చేస్తుండగా.. అక్కడ కనిపించింది చూసి షాక్ తిన్నాడు. ఆ రైతు ఏం చూశాడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
వివరాల్లోకి వెళ్తే.. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం అల్లాపురం గ్రామానికి చెందిన వల్లపు మల్లయ్య, రాములు, యాదయ్యలు అమ్ముకున్న కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేస్తున్నారు. గ్రామ శివారులో రాచకొండ గుట్టల్లోని భూమిని రైతులు ట్రాక్టర్‌తో చదును చేస్తున్నారు. అదే సమయంలో కొండచిలువ ప్రత్యక్షమైంది. ఒక్కసారిగా చెట్ల పొదల నుంచి కొండచిలువ బయటకు వచ్చింది. దీంతో రైతులు భయంతో షాక్ తిన్నారు. కొద్దిసేపు ఆ ప్రాంతంలో ఉండి.. తిరిగి అడవిలోకి కొండచిలువ వెళ్లిపోవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. 15 అడుగుల పొడవుతో కొండచిలువ భయంకరంగా ఉందని రైతులు చెబుతున్నారు.
