AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే…!

నకిలీ నోట్ల చలామణి విషయాన్ని కొందరు వ్యాపారులు రాచకొండ చౌటుప్పల్ పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. చౌటుప్పల్ సంస్థ నారాయణపూర్ ప్రాంతాల్లో వ్యాపారులు సంత జరిగిన ప్రాంతాల్లో సిసి ఫుటేజిని పోలీసులు పరిశీలిస్తున్నారు. సిసి ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిఘా పెట్టి నకిలీ కేటుగాళ్ళను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. నకిలీ కరెన్సీపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చౌటుప్పల్ ఏసిపి మధుసూదన్ రెడ్డి సూచించారు.

యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే...!
Fake Currency Notes
M Revan Reddy
| Edited By: |

Updated on: Dec 26, 2024 | 6:08 PM

Share

యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం రేపాయి. నకిలీ నోట్లు ముద్రించి కొందరు దుండగులు చెలామణి చేస్తున్నారు. సాధారణ కరెన్సీ నోట్లను పోలిన విధంగానే ఉండటంతో సామాన్యులు మోసపోతున్నారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపూర్ మండలాల్లో మూడు నాలుగు రోజులుగా పలు చోట్ల నకిలీ వంద, ఐదు వందల నోటు తీసుకుని మోసపోయారు. గుర్తు తెలియని వ్యక్తులు అమాయకులకు నకిలీ 500 రూపాయల నోట్లు అంటగడుతున్నారు. చిరువ్యాపారులే లక్ష్యంగా నకిలీ కేటుగాళ్లు మోసం చేస్తున్నారు.

చౌటుప్పల్ సంతలో చిరు వ్యాపారులే లక్ష్యంగా దుండగులు నకిలీ నోట్లను చలామణి చేస్తున్నారు. చౌటుప్పల్ సంతలో కిరాణా వ్యాపారి, పండ్ల దుకాణందారున్ని ఒకే రోజు గుర్తు తెలియని వ్యక్తులు మోసం చేశారు.‌ నారాయణపూర్ లోని ఓ కిరాణా షాపు వ్యాపారికి కేటు గాడు నకిలీ 500 రూపాయల నోట్లు ఇచ్చి 50 రూపాయల సబ్బులు తీసుకుని 450 చిల్లర తీసుకుని పోయాడు. మూడు నాలుగు రోజులుగా చౌటుప్పల్ డివిజన్ లో దుండగులు నకిలీ కరెన్సీని చలామణి చేస్తున్నారు. కొందరు వ్యాపారులు నకిలీ కరెన్సీ నోట్లను గుర్తించి.. తిరస్కరించారు. కొందరు వ్యాపారులు నకిలీ కరెన్సీ నోట్లను గుర్తించలేక.. తీసుకొని లబోదిబోమంటున్నారు. నకిలీ నోట్ల చలామణి విషయాన్ని కొందరు వ్యాపారులు రాచకొండ చౌటుప్పల్ పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు.

చౌటుప్పల్ సంస్థ నారాయణపూర్ ప్రాంతాల్లో వ్యాపారులు సొంత జరిగిన ప్రాంతాల్లో సిసి ఫుటేజిని పోలీసులు పరిశీలిస్తున్నారు. సిసి ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిఘా పెట్టి నకిలీ కేటుగాళ్ళను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. నకిలీ కరెన్సీపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చౌటుప్పల్ ఏసిపి మధుసూదన్ రెడ్డి సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
అమెరికాలో కూతురి పెళ్లి... ఆన్‌లైన్‌లో అక్షింతలు..!
అమెరికాలో కూతురి పెళ్లి... ఆన్‌లైన్‌లో అక్షింతలు..!
ప్రజావాణితో వెలిగిన రైతు జీవితం..25 ఏళ్ల కల నెరవేరి.. బీడు భూమిలో
ప్రజావాణితో వెలిగిన రైతు జీవితం..25 ఏళ్ల కల నెరవేరి.. బీడు భూమిలో
కోట్లు ఖర్చు పెట్టినా తగ్గని రోగాలను చిటికెలో మాయం చేసే నేచురల్ మ
కోట్లు ఖర్చు పెట్టినా తగ్గని రోగాలను చిటికెలో మాయం చేసే నేచురల్ మ
తుమ్మిడిహెట్టిపై తెలంగాణ మాస్టర్ ప్లాన్..!
తుమ్మిడిహెట్టిపై తెలంగాణ మాస్టర్ ప్లాన్..!
వెండి కొనబోతున్నారా? మీకో గుడ్‌న్యూస్‌..భారీగా తగ్గిన సిల్వర్‌ ధర
వెండి కొనబోతున్నారా? మీకో గుడ్‌న్యూస్‌..భారీగా తగ్గిన సిల్వర్‌ ధర
చేతబడి అనుమానాలు, పాత కక్షలతో దారుణం..!
చేతబడి అనుమానాలు, పాత కక్షలతో దారుణం..!
సర్పానికి సర్జరీ చేసి ప్రాణం పోశారు.. నాగ జెర్రీ గురించి తెలుసా..
సర్పానికి సర్జరీ చేసి ప్రాణం పోశారు.. నాగ జెర్రీ గురించి తెలుసా..
క్రికెట్ వదిలి పైలెట్‌గా మారిన ప్లేయర్.. ఎవరో తెలుసా?
క్రికెట్ వదిలి పైలెట్‌గా మారిన ప్లేయర్.. ఎవరో తెలుసా?
దేశ వృద్ధి రేటు 7.8 శాతం.. ప్రజల సంకల్పంతోనే సాధ్యమైంది: ప్రధాని
దేశ వృద్ధి రేటు 7.8 శాతం.. ప్రజల సంకల్పంతోనే సాధ్యమైంది: ప్రధాని
సకల రోగాలకు ఒకటే బ్రహ్మాస్త్రం.. బంగారం కంటే విలువైనది
సకల రోగాలకు ఒకటే బ్రహ్మాస్త్రం.. బంగారం కంటే విలువైనది