Cold Wave: బాబోయ్ చలి.. రికార్డు స్థాయిలో పడిపోయిన ఉష్ణోగ్రతలు.. మరో 3 రోజులు బీభత్సమే

"బాబోయ్ చలి.." నాలుగైదు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తున్న మాట. చలిభయంతో బయటకు వెళ్లాలంటేనే వణికిపోతున్న పరిస్థితి. అదే సమయంలో ఆరోగ్య శాఖ నుంచి కూడా హెచ్చరికలు వస్తున్నాయి. అప్రమత్తంగా లేకపోతే ప్రమాదమే అంటున్నారు వైద్యులు.. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది.

Cold Wave: బాబోయ్ చలి.. రికార్డు స్థాయిలో పడిపోయిన ఉష్ణోగ్రతలు.. మరో 3 రోజులు బీభత్సమే
Cold Wave
Follow us
P Shivteja

| Edited By: Shaik Madar Saheb

Updated on: Jan 05, 2025 | 12:48 PM

తెలుగు రాష్ట్రాలపై చలిపులి..పంజా విసురుతోంది. ఉన్నట్లుండి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో సింగిల్ డిజిట్‌కు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు గజ గజ వణికిపోతున్నారు. పెరిగిన చలి తీవ్రతతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. అయితే.. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉమ్మడి మెదక్ జిల్లాను చలి వణికిస్తోంది.. సంగారెడ్డి జిల్లా జిల్లాలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది.. ఇక రాత్రి పూట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి.. రాష్ట్రంలో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత కోహిర్ లో 6 డిగ్రీలు నమోదు అయ్యింది. ఈ సీజన్లో జిల్లాలో ఇదే అత్యల్ప ఉషోగ్రత.. సంగారెడ్డి జిల్లాలోని 22 ప్రాంతాల్లో 10 డిగ్రీల కంటే తక్కువ ఉషోగ్రతలు నమోదు కాగా.. మెదక్ జిల్లాలో ఆరు చోట్ల 10 డిగ్రీల కంటే తక్కువ ఉషోగ్రతలు నమోదయ్యాయి.. తెలంగాణలో చలితీవ్రత మరో 3 రోజులు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది.. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ తగ్గుతాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తలెిపారు.

రోజంతా చలి పంజా..

రోజంతా చలి పులిలా పంజా విసురుతోంది.. వేకువజామున మొదలవుతున్న దట్టమైన పొగమంచు కమ్మేస్తూ ఉదయం 12గంటలు దాటినా చలి తీవ్రత తగ్గడం లేదు.. దీంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు.. బయటకు రావాలంటేనే జనం జంకే పరిస్థితి ఏర్పడింది.. గత కొద్ది రోజులుగా వాతావరణంలో మార్పుల కారణంగా చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోతున్నాయి..రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రత సంగారెడ్డి జిల్లాలోని కోహిర్ లో 6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. న్యాల్ కల్ 6.3.. అల్మాయి పేట 7.3, మల్ చెల్మ7.5, నల్లవల్లి 7.7, అల్గోల్ 7.9, సత్వార్ 8.1, బీహెచ్ఈఎల్ 8.2, నిజాంపేట్ 8.5, ఝరాసంగం 8.7, కంకోల్ 9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.

మెదక్, సిద్దిపేట జిల్లాలో కన్నా సంగారెడ్డిజిల్లాలో చలి తీవ్రత ఎక్కువ ఉంది.. చాలా చోట్లా సింగిల్ డిజిట్ నెంబర్ కి పడిపోతున్నాయి ఉష్ణోగ్రతలు… ప్రతిరోజు మార్నింగ్ వాక్ కు వెళ్లే అలవాటున్న వాకర్స్, తెల్లవారుజామున 5 గంటలకే నిద్రలేచి మార్నింగ్ వాక్ వెళతారు..పెరిగిన చలి కారణంగా వాకర్స్ ఉదయాన్నే లేవడం లేదు..చలికి భయపడి బయటకు రావడం లేదు.. ఉదయం 7 గంటలు దాటాక మార్నింగ్ వాక్ కు బయలు దేరుతున్నారు.

వైద్యుల సూచనలు..

ఉష్ణోగ్రతలు విపరీతంగా పడిపోతుండటంతో ఆస్తమా పేషంట్లు, వృద్ధులు, చిన్నారులకు ప్రమాదమని వైద్య నిపుణులు చెపుతున్నారు.. అనూహ్యంగా తగ్గుతున్న ఉష్ణోగ్రతలతో పెరుగుతున్న దగ్గు, జలుబు బాధితులపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. వృద్ధులు, పిల్లలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు.. రెండేళ్ల లోపు పిల్లలు, 65 ఏళ్లు దాటిన వృద్ధులు ఈ చలి కారణంగా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పిల్లల్లో శ్వాసకోశ సంబంధిత సమస్యల తీవ్రత సాధారణ పరిస్థితులతో పోలిస్తే 20 శాతం నుంచి 30 శాతం పెరిగిందని వైద్యులు చెబుతున్నారు. వృద్ధులపై చలి ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. అ అప్పర్ రెస్పిరేటరీ ఇన్‍ ఫెక్షన్ గా చెప్పబడే ఈ సమస్య ఎక్కువైతే ముక్కు కారడం.. ఊపిరి తిత్తుల్లోకి చల్లగాలి వెళితే వాయు నాళాలు కుచించుకు పోయి శ్వాస ఇబ్బందితో దగ్గు కూడా తీవ్రమవుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..