పాము కాటుకు శనగ మంత్రం..! గింజ చేతిపై పెడితే నురగలు కక్కుతున్న బాధితులు..!

85 శాతం పాములుల్లో విషం ఉండదు.. అలాంటి కాటు వేసినా.. ప్రాణానికి ప్రమాదం ఉండదు. కానీ, నిజంగా పాము కుట్టిందనే.. నమ్ముతూ ఇక్కడికి వస్తున్నారు. శనగ గింజకు.. విషం తీసే శక్తి ఉండదంటున్నారు వైద్యులు. సొమ్ము సిల్లిపడిపోవడానికి.. హిప్నాటిజం కారణమంటున్నారు డాక్టర్లు. ఈ నాటు వైద్యంతో ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందనే చెబుతున్నారు.

పాము కాటుకు శనగ మంత్రం..! గింజ చేతిపై పెడితే నురగలు కక్కుతున్న బాధితులు..!
Snake Bites Treatment
Follow us
G Sampath Kumar

| Edited By: Balaraju Goud

Updated on: Jan 05, 2025 | 12:57 PM

ఇక్కడికి.. ప్రతి ఆదివారం.. 500 మందికి పైగా బాధితులు వస్తుంటారు.. పాము కాటు, తేలు కాటు.. కుక్క కాటు.. ఇతర క్రిమి కీటకాలకు గురైన బాధితులు క్యూకడుతున్నారు. వైద్యం ఆధునికంగా మార్పులు వస్తున్నా.. ఇక్కడ మాత్రం నాటు వైద్యం వైపు మొగ్గు చూపుతున్నారు. పాము కాటుకు గురైన వారు.. సొమ్మసిల్లిపడిపోతున్నారు. అంతేకాదు నోటి నుంచి నురుసులు కక్కుతున్నారు. శనగ గింజ చేతిలో పెడుతే.. ఏ జంతువు కాటు వేసినా తగ్గుతుందని జనం నమ్ముతున్నారు. మరోవైపు, శనగ గింజ నాటు వైద్యంపై పలు విమర్శలు వస్తున్నాయి.

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో గత 40 ఏళ్లుగా.. ఈ శనగ గింజ నాటు వైద్యం కొనసాగుతుంది. పాము గానీ.. ఇతర జంతువులు కాటు వేస్తే, లక్ష్మయ్య అనే వ్యక్తి పేరు మీద ముడుపు కట్టుకుంటారు. ఆయన పేరు తలుచుకుని.. ముడుపు తీర్చుకుంటారు. తరువాత.. ఆదివారం కట్టిన ముడుపును గంభీరావుపేటలో విప్పుతారు. ఈ సందర్భంగా లక్ష్మయ్యకు సంబంధించిన వంశీయులు.

శనగ గింజతో వైద్యం చేస్తారు లక్ష్మయ్య కుటుంబసభ్యులు. అందరిని లైన్‌లో కూర్చోబెడుతారు. తరువాత.. చేతిలో శనగ గింజలు చేతిలో పట్టుకుని.. మంత్రాలు చదువుతూ తిరుగుతుంటారు. ఇలా… మంత్రులు చదువుతూ.. ఇక్కడికి వచ్చిన బాధితులకు శనగ గింజలు చేతిలో పెడుతుంటారు. ఎవరికైనా పాము కరుస్తే, వెంటనే కింద పడిపోతున్నారు. పది నిమిషాలు.. సృహ లేకుండా నేలపై పడిపోతున్నారు. మరి కొంత మంది నోటి నుంచి నురుగులు వస్తున్నాయి. పాము కాటు వేసిన వాళ్లే.. ఈ విధంగా కింద పడిపోతున్నారు.. దీంతో… బాధితులందరూ శనగ గింజతో వైద్యం చేయించుకుంటున్నారు. మరికొందరికి శనగ గింజ.. నీటిలో వేసుకుని తాగుతున్నారు.

అయితే.. 85 శాతం పాములుల్లో విషం ఉండదు.. అలాంటి కాటు వేసినా.. ప్రాణానికి ప్రమాదం ఉండదు. కానీ, నిజంగా పాము కుట్టిందనే.. నమ్ముతూ ఇక్కడికి వస్తున్నారు. శనగ గింజకు.. విషం తీసే శక్తి ఉండదంటున్నారు వైద్యులు. శనగ గింజలో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. సొమ్ము సిల్లిపడిపోవడానికి.. హిప్నాటిజం కారణమంటున్నారు డాక్టర్లు. ఈ నాటు వైద్యంతో ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందనే చెబుతున్నారు.

అయితే నిర్వాహకులు మాత్రం.. ఇంత వరకు ఒక్కరు కూడా చనిపోలేదని గట్టిగా నమ్ముతున్నారు. మంత్రదండంతోనే ఈ గాట్లకు చెక్ పెడుతున్నామని తెలుపుతున్నారు. తాము డబ్బులు తీసుకోవడం లేదని, ప్రజల ప్రాణాలను రక్షించేందుకు ఈ వైద్యం చేస్తున్నామని చెబుతున్నారు. ఇలాంటి నాటు వైద్యాన్ని నమ్మకూడదని జన జ్ఞాన వేదిక సభ్యులు చెబుతున్నారు. శనగ గింజ, ఇతర మంత్రాలు ఏం పని చేయవని తెలుపుతున్నారు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని ఇలాంటి మూఢ వైద్యం చేస్తున్నారని చెబుతున్నారు.

వైద్యరంగంలో అనేక మార్పులు వచ్చినా.. ఇంకా ఇలాంటి నాటు వైద్యం నమ్మడం ఆశ్చర్యకరంగా ఉందని డాక్టర్లు అంటున్నారు. హిప్నాటిజంతో కింద పడిపోయి.. సొమ్మసిల్లిపడిపోతున్నారని తెలుపుతున్నారు. ఇలాంటి నాటు వైద్యం చేసకోవద్దని కోరుతున్నారు. 40 యేళ్లుగా ఈ వైద్యం చేస్తున్నామని నిర్వహకులు చెబుతున్నారు. లస్మయ్య పేరుతో ముడుపు కట్టుకుంటే… ఎలాంటి విష పురుగు కాటు వేసినా ఏం కాదని తెలుపుతున్నారు.. తాము ఎవరిని మోసం చేయడం లేదని స్పష్టం చేస్తున్నారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..