Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. తాజాగా భద్రతాబలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు హతమైనట్టు తెలుస్తోంది. సుక్మా జిల్లా గొల్లపల్లి అటవీప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరగగా.. మృతుల్లో ఒక మహిళ, ఇద్దరు పురుషులు ఉన్నట్టు సమాచారం.

ఛత్తీస్‌గఢ్ సక్మా జిల్లాలో మరో సారి భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టులు భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు. అయితే ఘటనా స్థలంలో ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. మావోయిస్టు కదిలికలు ఉన్నాయన్న సమాచారంతో గురువారం తెల్లవారుజామున సుక్మా జిల్లా గొల్లపల్లి అటవీ ప్రాంతంలో పోలీసులు, భద్రతా బలగాలు మావోయిస్టుల కోసం గాలింపు చేపట్టాయి. ఈ విషయం తెలుసుకున్న మావోయిస్టులు.. భద్రతా బలగాల రాకను గమనించింది కాల్పులు జరిపారు.
దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు వారిపై ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సుమారు ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్టు అధికారులు పేర్కొన్నారు. మృతుల్లో ఒక మహిళ ఉన్నట్టు తెలుస్తోంది. కాగా ఆ ప్రాంతంలో ఇంకా ఆపరేషన్ కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




